‘ఖిలాడి’ ఫిబ్రవరి 11న విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడి షూటింగ్ ముగింపు దశలో ఉంది. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఖిలాడి సినిమా విడుదల తేదీని గురువారం చిత్రనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా విడుదల చేసిన పోస్టర్‌లో సిగరెట్ తాగుతూ మాస్ లుక్కులో రవితేజ కనిపించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో విడుదల చేసిన రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.
ప్రొడక్షన్ పనులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియెస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ డిఫరెంట్ రోల్‌ను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.
సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా.. అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు : రవి తేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి, అర్జున్, ఉన్ని ముకుందన్, అనసూయ భరద్వాజ్ తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments