'ఖయ్యూం భాయ్' టీజర్ ఆవిష్కరణ
- IndiaGlitz, [Thursday,April 06 2017]
గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా 'ఖయ్యూం భాయ్'. నయీమ్ పాత్రలో కట్టా రాంబాబు, ఏసీపీ పాత్రలో తారకరత్న నటిస్తున్నారు. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సాయి ఊహ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి కట్టా శారద చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ నాగ భూషణం, దర్శకుడు వి.సాగర్, సీనియర్ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామల సంయుక్తంగా టీజర్ ను ఆవిష్కరించారు. అనంతరం..
నయీమ్ పాత్రధారి కట్టా రాంబాబు మాట్లాడుతూ 'నయీమ్ చిన్నప్పటినుంచి ఎన్‌కౌంటర్‌లో మరణించిన వరకూ జరిగిన అన్ని సంఘటనల్ని తెరపై చూపిస్తున్నాం. ఓ పెద్ద సినిమా గా తెరకెక్కించాం. రేయింబవళ్లు శ్రమించి ఇష్టంగా సినిమా కోసం టీమ్ అంతా కలిసి పనిచేశాం. అందువల్లే ఇంత గొప్ప అవుట్ ఫుట్ తీసుకురాగలిగాం. ఎడిటర్ గౌతం రాజు గారు ప్రధమార్థం సినిమా చూసి బాగుందని ప్రశంసించారు. టీమంతా ధైర్యంగా ఉండొచ్చన్నారు. పాటలు, ఫైట్స్, కామెడీ అన్ని అంశాలున్న సినిమా ఇది. ప్రేక్షకులు అంతా మా సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా' అని అన్నారు.
చిత్ర దర్శకుడు భరత్ మాట్లాడుతూ'' ఈ కథ అనుకున్నప్పుడు నయీమ్ పాత్రకు రాంబాబు గారు అయితేనే బాగుంటుందని దాసరి నారాయణరావు గారు సలహా ఇచ్చారు. నయీమ్ మేనరిజమ్ రాంబాబు గారు బాగా స్టడీ చేసి చేశారు. మిగతా అన్నీ పాత్రలు కూడా హైలైట్ గా ఉంటాయి. మంచి టెక్నికల్ వెయిట్ ఉన్న మూవీ ఇది. భారీ బడ్జెట్ తో నిర్మించాం. మే రెండవ వారంలో సినిమా విడుదల చేస్తాం. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా' అని అన్నారు.
చిత్ర నిర్మాత కట్టా శారద చౌదరి మాట్లాడుతూ ' ప్రస్తుతం నయీమ్ అనే పేరు తెలుగు రాష్ర్టాల్లో బర్నింగ్ హాట్ టాపిక్. అలాంటి కంటెట్ ను తీసుకుని సినిమా గా చేశాం. సినిమా కోసం అంతా చాలా కష్టపడ్డారు. మంచి అవుట్ ఫుట్ వచ్చింది. ఈ చిత్రానికి నా తమ్ముళ్లు, పత్తిపాటి పుల్లారావుగారు సహకారం ఇచ్చారు. మే నెల రెండవ వారంలో సినిమా విడుదల చేస్తాం' అని అన్నారు.
నాగభూషణం మాట్లాడుతూ 'విలన్‌ని హీరోగా చూపించి తెరకెక్కించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. ఇలాంటి చిత్రాలు చేయడం కత్తిమీద సాము. చిన్న సినిమాలకు ప్రాముఖ్యతనివ్వాలి. సినిమా విజయం సాధిందిచి అందరికీ మంచి పేరు రావాలి' అని అన్నారు.
శ్యామల మాట్లాడుతూ 'వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాగుంటుందని ఆశిస్తున్నా. ట్రైలర్ బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
వి.సాగర్ మాట్లాడుతూ 'ఈ రియల్ స్టోరీ ట్రెండ్ సెట్టర్ అవుతుంది. ట్రైలర్ చూస్తే సినిమాలో స్టామినా ఏంటో తెలుస్తోంది. సినిమా విజయం సాధించి టీమ్ అందరికీ చక్కని పేరు..నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలని ఆశిస్తున్నా' అని అన్నారు.
నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ' భరత్ మంచి ట్యాలెంటెడ్ దర్శకుడు. అయినా ఆయనకు రావాల్సినంత పేరు రాలేదు. ఇప్పుడు ఈ సినిమా చక్కటి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది. కట్టా రాంబాబు అచ్చం నయీమ్‌లాగానే ఉన్నాడు'' అని అన్నారు.
ప్రసన్న కుమార్ మట్లాడుతూ ' గ్యాంగ్ స్టర్ అంటే దావూద్ ఇబ్రహిం నే గుర్తుకు వస్తాడు. కానీ నయీమ్ గురించి తెలిసింది చాలా తక్కువ. ఆయన ఎంత పవర్ ఫుల్ వ్యక్తినో..ఆయన అసలు కథ ఏంటన్నది ఈ సినిమా ద్వారా చెప్పబొతున్నారు. వర్మ మూడు పార్టుల్లో తీస్తానన్నారు. అంతకు ముందే వీళ్లు ఈ సినిమాను తీసేశారు. నయీమ్ పాత్రలో రాంబాబు నూటికి నూరుశాతం పక్కగా యాప్ట్ అయ్యాడు' అని అన్నారు.
ఈ కార్యక్రమంలో శేఖర్ చంద్ర, వీరశంకర్, చిన్నా, దిలీప్, బెనర్జీ, కిరణ్, బెక్కం వేణుగోపాల్, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.
మౌని (బెంగళూరు), ప్రియ , హర్షిత ,రాగిని , సుమన్ , చలపతిరావు, బెనర్జీ, యల్.బి. శ్రీరాం, జీవ, వినోద్, రాంజగన్ ,ఫిష్ వెంకట్ , దాసన్న, కోటేశ్వరరావు , జూనియర్ రేలంగి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. కెమెరా: శ్రీధర్ నార్ల, ఎడిటింగ్: గౌతంరాజు, కళ: పి.వి.రాజు, సంగీతం: శేఖర్ చంద్ర, ఫైట్స్: విజయ్, డ్యాన్స్: శేఖర్, మాటలు: భవానీ ప్రసాద్, కథ-కథనం-దర్శకత్వం: భరత్