ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'ఖయ్యూంభాయ్'
Sunday, June 25, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
గ్యాంగ్స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా-`ఖయ్యూం భాయ్`. నయీమ్ పాత్రలో కట్టా రాంబాబు, ఏసీపీ పాత్రలో తారకరత్న నటిస్తున్నారు. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సాయి ఊహ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి కట్టా శారద చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు భరత్ మాట్లాడుతూ, ` చిత్రీకరణ సమయంలో అడ్డంకులు ఎదురైనా వాటన్నింటిని తట్టుకుని మూడు నెలలు పాటు అహర్నిశలు టీమ్ అంతా శ్రమించి షూటింగ్ పూర్తిచేశాం. నిర్మాత కట్టా శారదా చౌదరి గారు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. అడిగిందల్లా ఇన్ టైమ్ లోనే సమకూర్చారు. అందువల్లే మంచి అవుట్ ఫుట్ తీసుకురాగలిగాం. గతంలో నేను చేసిన `మైసమ్మ ఐపీఎస్` చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఆ సక్సెస్ ను ఈ సినిమా మించి పోతుంది. నా కెరీర్ లో ఓ మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుంది. ఈనెల 30న సినిమా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాం` అని అన్నారు.
నయీమ్ పాత్ర ధారి కట్టా రాంబాబు , ` సినిమా అనేది 18వ ఏట నాకల. ఆ డ్రీమ్ ఇప్పుడు ఖయ్యూంభాయ్ సినిమాతో 50 ఏళ్ల వయసులో నెరవేరుతుంది. నయీమ పాత్ర చేయడం నాకు..సినిమాకు మంచి హైప్ ను తీసుకొచ్చింది. సినిమా బాగా వచ్చింది. ఇటీవల విడుదలైన పాటలకు శ్రోతల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సినిమా కుడా మంచి విజయాన్ని అందుకుంటుంది. సినిమా నిర్మాణంలో నా భార్య శారద, శ్రీనివాస్, ధనుంజయ్ , ప్రత్తిపాటు పుల్లారావు గారి సహకారం మరువలేనిది. ఈనెల 30న సినిమా విడుదల చేస్తున్నాం` అని అన్నారు.
నిర్మాత కట్టా శారద చౌదరి , ` సినిమా కోసం రేయింబవళ్లు కష్టించి పనిచేశాం. మంచి అవుట్ ఫుట్ వచ్చింది. సినిమా పెద్ద సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉంది` అని అన్నారు.
నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ , ` రొటీన్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వారికి ఇది ఒక డిఫరెంట్ సినిమా అవుతుంది. నయీమ్ కథ కాబట్టి కొత్త పాయింట్ లేటెస్ట్ గా టీవీ ల్లో న్యూస్ పేపర్స్ ద్వారా మన అందరికి తెలిసిందే. నయీమ్ ఎలా ఉంటాడో తెలియదు కానీ? కట్టారాంబాబు లా ఉంటాడేమో అన్నట్ట్టు గా కరెక్ట్ గా సరిపోయాడు .ట్రైలర్స్, సాంగ్స్ చూస్తుంటే భరత్ సక్సెస్ అయ్యాడు అనిపిస్తుంది. భరత్ చాలా సీనియర్ డైరెక్టర్ దాదాపు ఒక 30 సినిమాలు చేసారు మైసమ్మ ఐ .పి .ఎస్ లాంటి సినిమా తో హిట్ కొట్టాడు. ఈ సినిమా తో భరత్ కి పెద్ద బ్రేక్ వస్తుంది అని ఆశిస్తున్నా` అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బి.ఎన్ రెడ్డి, బెనర్జీ, వల్లూరి పల్లి రమేష్, డ్యాన్స్ మాష్టర్ కిరణ్, కల్యాణ్, ధనుంజయ్, లక్ష్మణ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments