'ఖయ్యుంభాయ్' కు గుమ్మడికాయ కొట్టేస్తున్నారు
Saturday, March 18, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా-`ఖయ్యుం భాయ్`. నయీమ్ పాత్రలో కట్టా రాంబాబు, ఏసీపీ పాత్రలో తారకరత్న నటిస్తున్నారు. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సాయి ఊహ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి కట్టా శారద చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేటితో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఈ సందర్భంగా గుమ్మడికాయ కొట్టేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది.
ఈ సందర్భంగా నయీమ్ పాత్రధారి కట్టా రాంబాబు మాట్లాడుతూ ``భరత్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆయనతో 25 ఏళ్ల స్నేహ బంధం నాది. మద్రాసులో ఉన్నప్పటి నుంచి సుపరిచితం. ఈ సినిమాలో నటించే చిన్నా, బెనర్జీ తదితరులంతా స్నేహితులే. నందమూరి ఫ్యామిలీతోనూ చక్కని అనుబంధం ఉంది. తారకరత్న ఓ పవర్‌ఫుల్ ఏసీపీగా నటిస్తున్నారు. నయీమ్ చిన్నప్పటినుంచి ఎన్‌కౌంటర్‌లో మరణించిన వరకూ జరిగిన అన్ని సంఘటనల్ని తెరపై చూపిస్తున్నాం. సినిమా నిర్మాణంలో నా భార్యం సహకారం ఉంది. అందువల్లే అనుకున్న టైమ్ లో అన్ని పనులు పూర్తిచేయగలిగాను. ఓ పెద్ద సినిమాగా తెరకెక్కిస్తున్నాం. ఎడిటింగ్, డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. మిగతా పనులు కూడా పూర్తిచేసి ఏప్రిల్ లో సినిమా రిలీజ్ చేస్తాం` అని అన్నారు.
దర్శకుడు భరత్ మాట్లాడుతూ`` ఈ కథ రాసుకుని దీనికి పాత్రధారుల కోసం వెతుకుతున్నప్పుడు రాంబాబు గారు నయీమ్ పాత్రకు సూaటబుల్ అనిపించి ఎంపిక చేసుకున్నాం. నటనపై ఆయనకు ఎంతో ఆసక్తి ఉండడం వల్ల అంగీకరించారు. ఆ పాత్రకు ధీటుగా ఐపీఎస్ ఆఫీసర్ తారక రత్న పాత్ర ఉంటుంది. రెండు క్యారెక్టర్లు సినిమాకు హైలైట్ గా ఉంటాయి. యాక్షన్ సన్నివేశాలు పీక్స్ లో ఉంటాయి. మొత్తం ఆరు పాటలున్నాయి. శేఖర్ చంద్ర చక్కని సంగీతాన్ని అందించారు. టెక్నికల్ గా మంచి వెయిట్ ఉన్న మూవీ ఇది. నేటితో షూటింగ్ పూర్తిచేసి గుమ్మడికాయ కొట్టేస్తున్నాం. అన్ని పనులు పూర్తిచేసి సినిమా ఏప్రిల్ లో విడుదల చేస్తాం. కచ్ఛితంగా విజయం సాధించే చిత్రమిది`` అని అన్నారు.
నటుడు చలపతిరావు మాట్లాడుతూ ` నయీమ్ కథ అందరికీ తెలుసు. కానీ ఆయన గురించి తెలియని కొన్ని వాస్తవాలున్నాయి. వాటిని ఈ సినిమా లో చూపిస్తున్నాం. ఆ పాత్రలో రాంబాబు గారు బాగా నటించారు. ఆయన నిర్మాతగా, నటుడిగా అన్నీ బాధ్యతల్ని ఆయనే ఇష్టంతో మెసారు. సినిమా బాగా వచ్చింది. అలాగే మిగతా పాత్రలకు కూడా హైలైట్ గా ఉంటాయి. చిత్రం విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది` అని అన్నారు.
నటుడు చిన్నా మాట్లాడుతూ ` టెక్నికల్ గా సినిమా బాగా వచ్చింది. నయీమ్ క్యారెక్టర్ సినిమాను పిల్లర్ లా నిలబెడుతుంది. మంచి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం` అని అన్నారు.
మౌని (బెంగళూరు), ప్రియ , హర్షిత ,రాగిని , సుమన్ , చలపతిరావు, బెనర్జీ, యల్.బి. శ్రీరాం, జీవ, వినోద్, రాంజగన్ ,ఫిష్ వెంకట్ , దాసన్న, కోటేశ్వరరావు , జూనియర్ రేలంగి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. కెమెరా: శ్రీధర్ నార్ల, ఎడిటింగ్: గౌతంరాజు, కళ: పి.వి.రాజు, సంగీతం: శేఖర్ చంద్ర, ఫైట్స్: విజయ్, డ్యాన్స్: శేఖర్, మాటలు: భవానీ ప్రసాద్, కథ-కథనం-దర్శకత్వం: భరత్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments