'ఖయ్యుంభాయ్' గుమ్మడికాయ వేడుక !
Send us your feedback to audioarticles@vaarta.com
గ్యాంగ్స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా-`ఖయ్యుం భాయ్`. నయీమ్ పాత్రలో కట్టా రాంబాబు, ఏసీపీ పాత్రలో తారకరత్న నటిస్తున్నారు. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సాయి ఊహ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి కట్టా శారద చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్లైమాక్స్ సన్నివేశాలను, ప్యాచ్ వర్క్ ను హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో మంగళవారం షూట్ చేసారు. దీంతో సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా సెట్స్ లో గుమ్మడికాయ వేడుకను నిర్వహించారు. అనంతరం
నయీమ్ పాత్రధారి కట్టా రాంబాబు మాట్లాడుతూ ``భరత్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. మూడు నెలల పాటు ఎంతో కష్టపడి చిత్రీకరణ చేశాం. కష్టమైనా ఇష్టంగా టీమ్ అంతా కలిసి పనిచేశాం. పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఎడిటర్ గౌతం రాజు గారు సినిమా చూసి మెచ్చుకున్నారు. ధీమాగా ఉండొచ్చని నమ్మకంతో చెప్పారు. ప్రేక్షకులందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాం. మే మూడవ వారంలో సినిమా రిలీజ్ చేస్తున్నాం` అని అన్నారు.
దర్శకుడు భరత్ మాట్లాడుతూ`` సెప్టెంబర్ 18న సినిమాను అమరావతిలో ప్రారంభించాం. నేడు హైదరాబాద్ అల్యుమినియం ప్యాక్టరీలో షూటింగ్ పూర్తిచేశాం. చిత్రీకరణ సమయంలో అడ్డంకులు ఎదురైనా వాటన్నింటిని తట్టుకుని మూడు నెలలు పాటు అహర్నిశలు టీమ్ అంతా శ్రమించి షూటింగ్ పూర్తిచేశాం. నిర్మాత కట్టా శారదా చౌదరి గారు బడ్జెట్ విషయంలో ఎక్కడ
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments