మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా 'ఖయ్యూంభాయ్' ఆడియో ఆవిష్కరణ
Saturday, June 10, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
గ్యాంగ్స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా-`ఖయ్యూం భాయ్`. నయీమ్ పాత్రలో కట్టా రాంబాబు, ఏసీపీ పాత్రలో తారకరత్న నటిస్తున్నారు. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సాయి ఊహ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి కట్టా శారద చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఎఫ్ ఎన్ సీసీ కల్చరల్ సెంటర్ లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తి పాటి పుల్లారావు బిగ్ సీడీని ఆవిష్కరించగా, నటుడు సుమన్ సీడీలను ఆవిష్కరించి అతిధులుగా..యూనిట్ సభ్యులకు అందజేశారు. టీజర్ ను కార్పోరేటర్ ఖాజా సూర్యనారాయణ విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, ` ఏపీ లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతిలో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న తొలి సినిమా ఖయ్యూంభాయ్ నే. గ్యాంగ్ స్టర్ నయిమ్ ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ర్టాలలో హాట్ టాపిక్. అలాంటి కథాంశం తీసుకుని రాంబాబు సినిమా చేయడం ఇంట్రెస్ట్ గా ఉంది. ప్రజలు అతని కథ తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. రాంబాబు కూడా చూడటానికి నయీమ్ లానే ఉంటాడు. అతని ఆహార్యం రాంబాబుకి బాగా సెట్ అయింది. ట్రైలర్ చూస్తుంటే సన్నివేశాలన్ని చాలా సహజంగా కనిపిస్తున్నాయి. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఇలాంటి సినిమాలు విజయం సాధిస్తే మరింత మంది కొత్త నిర్మాతలు సినీ పరిశ్రమకు రావడానికి ఉత్సాహం చూపిస్తారు. సినిమా నిర్మాణానికి ధనుంజయ్, కాంతారావు బాగా సహకరించారు` అని అన్నారు.
నటుడు సుమన్ మాట్లాడుతూ, ` దర్శకుడు భరత్ మంచి టెక్నీషియన్. ఈ వాస్తవ సంఘటనను చక్కగా తెరకెక్కించారు. రాంబాబు గారు నయీమ్ పాత్రకు పక్కా గా యాప్ట్ అయ్యారు. చక్కగా ఆ పాత్రలో ఒదిగిపోయారు. గౌతమ్ రాజు గారి ఎడిటింగ్ బాగుంది. కథలో కొత్తదనం ఉంటే ఎలాంటి సినిమానైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సినిమా కూడా ఆడియన్స్ కు తప్పకుండా నచ్చుతుంది` అని అన్నారు.
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడూతూ, ` రాంబాబు నాకు మంచి మిత్రుడు. నయీమ్ ఇప్పుడు తెలంగాణలో బాగా హాట్ టాపిక్. ఆయన కథతో సినిమా చేస్తున్నారు. ఇక్కడ మంచి ఓపెనింగ్స్ దక్కుతాయి. సినిమా పెద్ద విజయంసాధిస్తుంది` అని అన్నారు.
నయీమ్ పాత్రధారి కట్టా రాంబాబు మాట్లాడుతూ `` పద్మాలయ స్టూడియో లో టెక్నీషియన్ గా నా సినిమా కెరీర్ ప్రారంభం అయింది. తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాను. రియాల్టర్ గా, పొలిటీషియన్ గా అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నా. నయీమ్ కథను సినిమాగా చేస్తే బాగుంటుందని ఆలోచనతో సినిమా చేయడం జరిగింది. వాస్తవానికి నయీమ్ కు నాకు చిన్న కనెక్షన్ ఉంది. నయీమ్ అంటే ఎవరో తెలియనప్పుడు ఒకరోజు ఆయన నాకు ఫోన్ చేసి బెదిరించే ప్రయత్నం చేశాడు. ఆయన ఎలాంటి వాడో తెలియక నేను కూడా ర్యాష్ గానే మాట్లాడా. తర్వాత నా స్నేహితుడు ద్వారా నయీమ్ గురించి తెలసుకున్నా. ఇప్పుడు ఆయన కథను సినిమా చేసాం. ఆయన గురించి ప్రజలకు తెలియని చాలా విషయాలను సినిమాలో చూపించబోతున్నాం. శేఖర్ చంద్ర మంచి సంగీతం అందించారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు నన్ను బాగా సపోర్ట్ చేశారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమా చేశాం. నా కోసం కొంత మంది నటులు పారితోషికం తగ్గించుకుని మీర నటించారు. వాళ్లందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. గౌతమ్ రాజు గారు సినిమా చూసి ధీమగా ఉండొచ్చని నమ్మకాన్ని ఇచ్చారు. తెలుగు ఆడియన్స్ అంతా మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం` అని అన్నారు.
దర్శకుడు భరత్ మాట్లాడుతూ`` సెప్టెంబర్ 18న సినిమాను అమరావతిలో ప్రారంభించాం. చిత్రీకరణ సమయంలో అడ్డంకులు ఎదురైనా వాటన్నింటిని తట్టుకుని మూడు నెలలు పాటు అహర్నిశలు టీమ్ అంతా శ్రమించి షూటింగ్ పూర్తిచేశాం. నిర్మాత కట్టా శారదా చౌదరి గారు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. అడిగిందల్లా ఇన్ టైమ్ లోనే సమకూర్చారు. అందువల్లే మంచి అవుట్ ఫుట్ తీసుకురాగలిగాం. గతంలో నేను చేసిన `మైసమ్మ ఐపీఎస్` చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఆ సక్సెస్ ను ఈ సినిమా మించి పోతుంది. నా కెరీర్ లో ఓ మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుంది` అని అన్నారు.
చిత్ర నిర్మాత కట్టా శారద చౌదరి మాట్లాడుతూ, ` మంచి కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. క్వాలిటీ కోసం భారీగా ఖర్చు చేశాం. మంచి అవుట్ ఫుట్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులంతా మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు.
సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ, ` ఇది నాకొక ఛాలెంజింగ్ ఫిల్మ్. ఇలాంటి సినిమాలకు ఇప్పటివరకూ పనిచేయలేదు. దీంతో కొంచెం టెన్షన్ పడ్డా. అయినా పాటలు బాగా వచ్చాయి. భరత్ గారు మంచి సహాకారాన్ని అందజేశారు. ఆయనతో సినిమా చేయడం గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. రాంబాబు గారు చక్కగా నటించారు. సినిమా మంచి విజయం సాధిస్తుంది` అని అన్నారు.
ఈ వేడుకలో శివస్వామి, కిషన్ రావు, వినోద్, బెనర్జీ, చిన్నా, శ్రీధర్, ఖాజా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మౌని (బెంగళూరు), ప్రియ , హర్షిత ,రాగిని , సుమన్ , చలపతిరావు, బెనర్జీ, యల్.బి. శ్రీరాం, జీవ, వినోద్, రాంజగన్ ,ఫిష్ వెంకట్ , దాసన్న, కోటేశ్వరరావు , జూనియర్ రేలంగి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. కెమెరా: శ్రీధర్ నార్ల, ఎడిటింగ్: గౌతంరాజు, కళ: పి.వి.రాజు, సంగీతం: శేఖర్ చంద్ర, ఫైట్స్: విజయ్, డ్యాన్స్: శేఖర్, మాటలు: భవానీ ప్రసాద్, కథ-కథనం-దర్శకత్వం: భరత్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments