వినోదాత్మకంగా ఖాకీసత్తా

  • IndiaGlitz, [Monday,August 17 2015]

కౌశిక్ బాబు కథానాయకుడిగా శశాంక్ వోలేటి దర్శకత్వంలో ఆకుల లోకేష్, నూకల చిట్టిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మిస్టర్ కె'. ఖాకీసత్తా.. ఉపశీర్షిక. ఆర్తి కథానాయిక. అల్యూమినియం ఫ్యాక్టరీలో పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. సోమవారం హీరో కౌశిక్ బాబు జన్మదిన వేడుకలు యూనిట్ సభ్యుల మధ్య జరిగాయి.

కౌశిక్ బాబు మాట్లాడుతూ.. "ఇక్కడ పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉంది. పోలీస్ డ్రెస్ వేసుకుని తిరుగుతూ దొంగ పనులు చేసే ఓ కుర్రాడి కథ ఇది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో చిత్రం తెరకెక్కుతుంది. దొంగ పోలీస్ ఎలా అయ్యాడనేది ఆసక్తికరం. రమణ మాస్టర్ నేతృత్వంలో జిహాది ట్రైనింగ్ జరుగుతున్న యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. పోలీస్ సిద్దయ్య పాత్రలో పోసాని కృష్ణమురళి నటిస్తున్నార"న్నారు.

నిర్మాత లోకేష్ మాట్లాడుతూ.. "నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న మా హీరో కౌశిక్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు. యదార్థ సంఘటనల ఆధారంగా తీవ్రవాద నేపథ్యంలో చిత్రం రూపొందిస్తున్నాం. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. జూలై 29న ప్రారంభమైన సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. 60శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీను ప్రకటిస్తామ"న్నారు.

దర్శకుడు మాట్లాడుతూ... "వినోదం, యాక్షన్, సెంటిమెంట్ అంశాలతో తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను" అన్నారు. కార్యక్రమంలో ఆర్తి, నాగ శ్రీవత్స, దీపక్ మీనన్, ముక్తార్ ఖాన్, రమణ తదితరులు పాల్గొన్నారు. సంపత్ రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ : శారదా విజయబాబు, మాటలు : మోహన్ దీక్షిత్.

More News

'బెంగాల్ టైగ‌ర్' నైజాం హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న గ్లోబ‌ల్ సినిమాస్‌

మాస్ మహరాజ్‌ రవితేజ హీరోగా, త‌మ‌న్నా, రాశి ఖ‌న్నా హీరోయిన్స్ గా, సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న 'బెంగాల్ టైగ‌ర్' చిత్రానికి సంబందించి షూటింగ్ చివ‌రి ద‌శ‌లో వుంది.

దాసరి చేతుల మీదుగా 'అనగనగా ఒక చిత్రమ్' ఆడియో విడుదల

‘ప్రేమకథా చిత్రవ్‌ు’ దర్శకుడు జె.ప్రభాకర్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో కొడాలి సుబ్బారావుతో కలిసి జె ప్రొడక్షన్స్, గోవర్షిణి ఫిలింస్ పతాకాలపై శివ, మేఘశ్రీ జంటగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక చిత్రమ్’

దాన్ని లెక్క కట్టలేమన్న నిర్మాత...

అనుష్క టైటిల్ పాత్రలో గుణా టీమ్ వర్క్స్ బ్యానర్పై గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రుద్రమదేవి’.

సపోర్ట్ కోసం అందరి ఇళ్లు తిరుగుతున్న హీరో

తమిళ యంగ్ హీరో విశాల్ ప్రస్తుతం అక్కడ నడిగర్ సంగం ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నటీనటులకు

క్లారిటీ ఇచ్చిన మహేష్...

శ్రీమంతుడు చిత్రంతో డబ్బున్న ప్రతి ఒక్కరూ తమ ఊరికి ఏదైనా చేయాలనే మెసేజ్ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన ఊరు బుర్రిపాలెంను దత్తత తీసుకోనున్నాడని వార్తలు వినిపించాయి.