ఖకీ - బొక్స్ ఆఫిస్ కలెక్షన్ల మొత
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పుడు సినిమా ప్రేక్షకుల్లో ఎక్కడ చూసినా 'ఖాకి' మాటలే. విడుదలైన మొదటి రొజు నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది 'ఖాకి'. ముందు నుంచీ తాము విన్నదే సినిమాలోనూ కనిపించేసరికి సినీ ప్రియుల్లో ఆనందం మొదలైంది. మౌత్‌టాక్ వల్ల సినిమామీద ఇంకా క్రేజ్ పెరిగింది. సర్వత్రా థియేటర్లన్నీ జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఇది డబ్డ్ సినిమా అయినప్పటికీ, ప్రేక్షకులు దీనిని ఒక ష్ట్రైట్ తెలుగు సినిమాగా ఆదరిస్తున్నరూ.
ఇప్పటిదాకా రకరకాల పాత్రల్లో తెలుగువారిని మెప్పించిన కార్తి కాప్‌గా నటించిన చిత్రమిది. తనకున్న ఒత్తిళ్లు, ఫ్యామిలీ టెన్షన్స్ మధ్య కర్కోటకంగా ప్రవర్తించిన నేరగాళ్ల చరిత్రను ఓ నిజాయతీగల పోలీస్ అధికారి, అతని టీమ్ ఎలా బయటపెట్టిందనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది. సినిమా ఆద్యంతం రేసీ సీక్వెన్స్ తో మెప్పించింది.
ఫస్టాఫ్‌లో కార్తి, రకుల్ మధ్య వచ్చే సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి. పెళ్లైన కొత్తలో జరిగిన విషయాలు దంపతులకు మరోసారి గుర్తుచేసేలా ఉంటాయి. పక్కింటమ్మాయిని, ఎదురింటి అమ్మాయిని ప్రేమించిన వారు, ప్రేమలో ఉన్నవారు కార్తి, రకుల్ మధ్య వచ్చే సన్నివేశాలకు మరింతగా కనెక్ట్ అవుతారు. జిబ్రాన్ చేసిన ట్యూన్లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అవుతున్నాయి.
కార్తి నటన, హెచ్.వినోద్ అల్లుకున్న ఇంటెన్స్ సీక్వెన్స్ లు థ్రిల్ కలిగిస్తున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ కు మాస్ ఫిదా అవుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments