ఖకీ - బొక్స్ ఆఫిస్ కలెక్షన్ల మొత

  • IndiaGlitz, [Monday,November 20 2017]

ఇప్పుడు సినిమా ప్రేక్షకుల్లో ఎక్కడ చూసినా 'ఖాకి' మాటలే. విడుదలైన మొదటి రొజు నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది 'ఖాకి'. ముందు నుంచీ తాము విన్నదే సినిమాలోనూ కనిపించేసరికి సినీ ప్రియుల్లో ఆనందం మొదలైంది. మౌత్టాక్ వల్ల సినిమామీద ఇంకా క్రేజ్ పెరిగింది. సర్వత్రా థియేటర్లన్నీ జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఇది డబ్డ్ సినిమా అయినప్పటికీ, ప్రేక్షకులు దీనిని ఒక ష్ట్రైట్ తెలుగు సినిమాగా ఆదరిస్తున్నరూ.

ఇప్పటిదాకా రకరకాల పాత్రల్లో తెలుగువారిని మెప్పించిన కార్తి కాప్గా నటించిన చిత్రమిది. తనకున్న ఒత్తిళ్లు, ఫ్యామిలీ టెన్షన్స్ మధ్య కర్కోటకంగా ప్రవర్తించిన నేరగాళ్ల చరిత్రను ఓ నిజాయతీగల పోలీస్ అధికారి, అతని టీమ్ ఎలా బయటపెట్టిందనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది. సినిమా ఆద్యంతం రేసీ సీక్వెన్స్ తో మెప్పించింది.

ఫస్టాఫ్లో కార్తి, రకుల్ మధ్య వచ్చే సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి. పెళ్లైన కొత్తలో జరిగిన విషయాలు దంపతులకు మరోసారి గుర్తుచేసేలా ఉంటాయి. పక్కింటమ్మాయిని, ఎదురింటి అమ్మాయిని ప్రేమించిన వారు, ప్రేమలో ఉన్నవారు కార్తి, రకుల్ మధ్య వచ్చే సన్నివేశాలకు మరింతగా కనెక్ట్ అవుతారు. జిబ్రాన్ చేసిన ట్యూన్లు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అవుతున్నాయి.

కార్తి నటన, హెచ్.వినోద్ అల్లుకున్న ఇంటెన్స్ సీక్వెన్స్ లు థ్రిల్ కలిగిస్తున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ కు మాస్ ఫిదా అవుతున్నారు.

More News

ఆ ద‌ర్శ‌కుడితో సాయిధ‌ర‌మ్ మ‌ళ్లీ సినిమా..?

మెగా క్యాంప్ హీరోల్లో ఒక‌డు సాయిధ‌ర‌మ్ తేజ్‌. ఈ యువ క‌థానాయ‌కుడు న‌టించిన 'జ‌వాన్‌' డిసెంబ‌ర్ 1న విడుద‌ల‌వుతుంది. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టించింది. అరుణాచ‌ల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వైష్ణో కృష్ణ ఈ సినిమాతో నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నారు.

'జ‌వాన్‌'కు కొర‌టాల స‌పోర్ట్‌..

మెగా ఫ్యామిలీ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన చిత్రం 'జ‌వాన్‌'. ఈ సినిమా డిసెంబర్ 1న విడుద‌ల కానుంది. టైటిల్ విన‌గానే ఇదేదో దేశ‌భ‌క్తి సినిమా అనుకోవ‌ద్దు..దేశ‌భ‌క్తి సినిమా కాదు. కుటుంబం కోసం జ‌వానులా పోరాడే యువ‌కుడి క‌థ‌.

స్టార్ కమెడియన్ పై శంకర్ పిర్యాదు..

జెంటిల్మేన్, ప్రేమికుడు నుండి నేటి 2.0 వరకు డైరెక్టర్ శంకర్ తీసిన ప్రతి సినిమా సెన్సేషన్ గా నిలిచింది. దర్శకుడిగానే కాకుండా శంకర్ నిర్మాతగా కూడా ఎస్ పిక్చర్స్పై సినిమాలను నిర్మిస్తూ కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తున్నారు.

త్రిష‌..అరుదైన గౌర‌వం

హీరోయిన్‌గా ప‌దేళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్న‌ప్ప‌టికీ..కుర్ర హీరోయిన్స్‌కి కాంపిటీష‌న్ ఇస్తూ ఇస్తున్న హీరోయిన్ త్రిష‌. ఈ చెన్నై అమ్మ‌డు చేతినిండా సినిమాల‌తో తీరిక లేకుండా ఉంది. అయితే వీట‌న్నింటితో పాటు ఇప్పుడు త్రిష‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది.

'ప‌ద్మావ‌తి' వాయిదా..?

ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ వివాదాల్లో కూరుకున్న చిత్రం 'ప‌ద్మావ‌తి'. రాజ‌స్థాన్ మ‌హారాణి ప‌ద్మావ‌తి జీవిత‌గాథ‌ను సంజ‌య‌ల్ లీలా బ‌న్సాలీ అదే పేరుతో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.