ఫక్తు వాస్తవ ఘటనలతో 'ఖాకి'
Send us your feedback to audioarticles@vaarta.com
కార్తి, రకుల్ జంటగా నటించిన 'ఖాకి' చిత్రం వాస్తవ ఘటనలతో జరిగిందనే విషయం తెలిసిందే. చాలా సందర్భాల్లో సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని ఉంటారని అనుకుంటాం. కానీ నిజ జీవితంలో ఆ టీమ్ని లీడ్ చేసిన జాంగిద్ మాట్లాడుతూ తాము చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ని సినిమాలో అలాగే చిత్రీకరించారని చెప్పారు. హవేలీలలో చదువుకున్న పట్వారి ధరమ్సింగ్ని తాము ఎలా కిడ్నాప్ చేశామో, సినిమాలోనూ ఫక్తు అలాగే చేశారని చెప్పారు.
కొత్తగా పెళ్లయిన ఓ డీఎస్పీ తమ టీమ్లో కూడా ఉన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కార్తి నటన రియల్ పోలీసులాగా ఉందని, ట్రైన్డ్ కమాండోలాగా చేశారనీ అన్నారు. కేవలం ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా నేరస్తులను వెతికిపట్టుకున్న తీరును 'ఖాకి' మరోసారి కళ్లకు కట్టిందని అన్నారు. "సినిమాలో చూపించిన చాలా అంశాలు రియల్గా జరిగినవే. హవేలీలు దాడి చేసిన తీరు ఇంకా హింసాత్మకంగా ఉండేది. సినిమాల్లో దాన్ని కొద్దిగా తగ్గించే చూపించారు.
టీమ్ లీడర్గా నేను దాదాపు రోజుకు 500 కిలోమీటర్లు ప్రయాణాలు చేసేవాడిని. హవేలీల గ్యాంగ్ లీడర్ ఓమా వేలూరు జైల్లో చనిపోయారు. మరో ఇద్దరిని షూట్ చేశాం. మిగిలిన వాళ్లు కొందరు బెయిల్మీద వెళ్లినా.. ఆ గ్యాంగ్ ఇక తమిళనాడు వైపు రాదు. మేం హవేలీలలను పట్టుకున్నందుకు ఎక్కువగా సంతోషించింది ఉత్తరప్రదేశ్వాళ్లే.
హిందీ రాకపోవడం వల్ల ఉత్తరాదికి వెళ్లినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం. 'ఖాకి'లో చూపించినట్టే మా టీమ్ సభ్యులమే వండుకుని తినేవాళ్లం. వినోద్ ఈ కథను తెరకెక్కించి చాలా మంచి పనిచేశారు" అని చెప్పారు. విడుదలైన తొలి రోజు నుంచే మంచి అప్లాజ్ను, హిట్ టాక్ను తెచ్చుకున్న 'ఖాకి' చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహించారు. ఆదిత్య మ్యూజిక్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా తెలుగులో అందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout