Khairatabad Ganesh: ఈ ఏడాది ఖైరతాబాద్ మహా గణపతి రూపమిదే.. 50 అడుగులు, పూర్తిగా మట్టితోనే తయారీ
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో గణేశ్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిగే నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. ఇక్కడి గణేశ్ శోభాయాత్ర చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఇక ఖైరతాబాద్ గణపతి మరో ప్రత్యేక ఆకర్షణ . భారీ కాయంతో వుండే ఈ గణపయ్య హైదరాబాద్ కే తలమానికం. రెండేళ్లుగా కోవిడ్ కారణంగా భక్తులను నిరాశ పరిచిన ఖైరతాబాద్ గణేశుడు ఈసారి మాత్రం తగ్గేదే లేదంటున్నాడు.
50 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణపయ్య:
ఈ సంవత్సరం శ్రీ పంచముఖ మహా లక్ష్మీగణపతిగా ఖైరతాబాద్ గణపయ్య దర్శనమివ్వనున్నాడు. దాదాపు 50 అడుగుల ఎత్తులో విఘ్ననాథుడు కొలువుదీరనున్నాడు. ప్లాస్టర్ ఆప్ ప్యారీస్ ఇతర రసాయనాలేవి వాడకుండా కేవలం మట్టితోనే ఈ భారీకాయాన్ని రూపొందించనున్నారు. స్వామి వారికి ఎడమ వైపున శ్రీ త్రిశక్తి మహా గాయత్రి దేవి...కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వుంటారు. మొట్ట మొదటిసారి మట్టితో తయారవుతున్నాడు ఖైరతాబాద్ గణేషుడు.
ఈ నెల 10న కర్రపూజతో ప్రారంభమైన విగ్రహ తయారీ పనులు:
ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన చిత్రాన్ని నిర్వాహక కమిటీ సోమవారం విడుదల చేసింది. గత ఏడాది ఉత్సవాల సమయంలో మట్టి విగ్రహాలనే వాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఉత్సవ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో విగ్రహ తయారీ పూర్తవుతుందని.. రెండు రోజుల ముందుగానే స్వామి వారు ఉత్సవాలకు సిద్ధం అవుతారని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా ఈ నెల 10న కర్రపూజతో ప్రారంభమైన పనులు నిర్విఘ్నంగా సాగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com