Khairatabad Ganesh: ఈ ఏడాది ఖైరతాబాద్‌ మహా గణపతి రూపమిదే.. 50 అడుగులు, పూర్తిగా మ‌ట్టితోనే త‌యారీ

  • IndiaGlitz, [Tuesday,June 28 2022]

దేశంలో గ‌ణేశ్ న‌వ‌రాత్రులు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగే న‌గ‌రాల్లో హైద‌రాబాద్ కూడా ఒక‌టి. ఇక్క‌డి గ‌ణేశ్ శోభాయాత్ర చూసేందుకు దేశ విదేశాల నుంచి భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. ఇక ఖైర‌తాబాద్ గ‌ణ‌ప‌తి మ‌రో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ . భారీ కాయంతో వుండే ఈ గ‌ణ‌ప‌య్య హైద‌రాబాద్ కే త‌ల‌మానికం. రెండేళ్లుగా కోవిడ్ కార‌ణంగా భ‌క్తులను నిరాశ ప‌రిచిన ఖైర‌తాబాద్ గ‌ణేశుడు ఈసారి మాత్రం త‌గ్గేదే లేదంటున్నాడు.

50 అడుగుల ఎత్తులో ఖైర‌తాబాద్ గ‌ణప‌య్య:

ఈ సంవ‌త్స‌రం శ్రీ పంచముఖ మహా లక్ష్మీగణపతిగా ఖైర‌తాబాద్ గ‌ణప‌య్య ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. దాదాపు 50 అడుగుల ఎత్తులో విఘ్న‌నాథుడు కొలువుదీర‌నున్నాడు. ప్లాస్ట‌ర్ ఆప్ ప్యారీస్ ఇత‌ర ర‌సాయ‌నాలేవి వాడ‌కుండా కేవ‌లం మ‌ట్టితోనే ఈ భారీకాయాన్ని రూపొందించ‌నున్నారు. స్వామి వారికి ఎడమ వైపున శ్రీ త్రిశక్తి మహా గాయత్రి దేవి...కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వుంటారు. మొట్ట మొదటిసారి మట్టితో త‌యార‌వుతున్నాడు ఖైరతాబాద్ గణేషుడు.

ఈ నెల 10న క‌ర్ర‌పూజ‌తో ప్రారంభమైన విగ్రహ తయారీ పనులు:

ఇందుకు సంబంధించిన‌ వివరాలతో కూడిన చిత్రాన్ని నిర్వాహ‌క క‌మిటీ సోమ‌వారం విడుద‌ల చేసింది. గత ఏడాది ఉత్సవాల సమయంలో మట్టి విగ్రహాలనే వాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఉత్సవ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో విగ్రహ తయారీ పూర్తవుతుందని.. రెండు రోజుల ముందుగానే స్వామి వారు ఉత్సవాలకు సిద్ధం అవుతారని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా ఈ నెల 10న క‌ర్ర‌పూజ‌తో ప్రారంభమైన పనులు నిర్విఘ్నంగా సాగుతున్నాయి.

More News

అందుకే తారక్ అంటే ఇష్టం .. జూనియర్‌ ఎన్టీఆర్‌పై బాలీవుడ్ విలన్ ప్రశంసలు

కెరీర్ తొలినాళ్లలో విలన్‌గా నటించి తర్వాత స్టార్ హీరోలుగా ఎదిగిన వారు ఎందరో. రజనీకాంత్, చిరంజీవి, మోహన్ బాబు, శ్రీకాంత్, గోపిచంద్ ఇలా లిస్ట్ చాలానే వుంది.

సందడిగా "చోర్ బజార్" సక్సెస్ మీట్

ఆకాష్ పూరి, గెహనా సిప్పీ హీరో హీరోయిన్లుగా దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన సినిమా చోర్ బజార్.

Sai Kiran : సభ్యత్వం పేరిట రూ.లక్షలు మోసం .. నిర్మాతపై ఫిర్యాదు చేసిన నువ్వేకావాలి సాయికిరణ్

నువ్వేకావాలి సినిమాలో తరుణ్, రిచాలతో పాటు సమానంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, సింగర్ సాయి కిరణ్‌ను ఇద్దరు వ్యక్తులు మోసం చేశారు.

Janasena : భావి తరాలను కాపాడుకోవాలంటే జనసేన రావాల్సిందే .. నేనూ కార్యకర్తలా శ్రమిస్తా: నాగబాబు

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేనను పటిష్ట పరిచే పనుల్లో బిజీగా వుంటున్నారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు.

ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్  "ఏనుగు" కు క్లీన్ U/A

శ్రీమతి జగన్మోహని సమర్పణలో  విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్,  డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై