ఖైదీ నెం150 థ్యాంక్స్ మీట్ అక్కడే..!

  • IndiaGlitz, [Tuesday,January 31 2017]

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 150వ చిత్రం ఖైదీ నెం 150 ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ తెర‌కెక్కించిన ఖైదీ నెం 150 రికార్డ్ స్ధాయిలో 100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్ తో మెగాస్టార్ మ‌రిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఇదిలా ఉంటే...ప్రేక్ష‌కాభిమానులు ఇంత‌టి విజ‌యాన్ని అందించినందుకు గాను భారీ స్ధాయిలో థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ థ్యాంక్స్ మీట్ జ‌ర‌గాలి కానీ కొన్ని కార‌ణాల వ‌ల‌న కుద‌ర‌లేదు. ఈ గ్రాండ్ ఫంక్ష‌న్ ను వైజాగ్ లో చేయాలి అనుకున్నారు కానీ...తాజా స‌మాచారం ప్ర‌కారం హైద‌రాబాద్ లోని కోట్ల విజ‌య‌భాస్క‌రెడ్డి స్టేడియంలో ఈ ఫంక్ష‌న్ ను చేయాలి అనుకుంటున్నార‌ని తెలిసింది.