ఖైదీ నెం 150 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న150వ చిత్రం ఖైదీ నెం 150. డైనమిక్ డైరెక్టర్ వినాయక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఖైదీ నెం 150 టీజర్ ను ఈనెల 8 సాయంత్రం రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసారు.
ఈ టీజర్ ను 9న రిలీజ్ అవుతున్న ధృవ ధియేటర్స్ లో ప్రదర్శించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో తెలియచేసారు. ఇక ఆడియో రిలీజ్ విషయానికి వస్తే....ఇప్పటి వరకు డేట్ ఎనౌన్స్ చేయలేదు.అయితే.. ఆడియో ఫంక్షన్ చేయకుండా డైరెక్ట్ గా మార్కెట్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆడియో రిలీజ్ గురించి అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారని సమాచారం. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com