ఖైదీ నెం150 టీజర్ రికార్డ్..!

  • IndiaGlitz, [Friday,December 09 2016]

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 8 సాయంత్రం రిలీజ్ చేసిన‌ ఖైదీ నెం 150 టీజ‌ర్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. టీజ‌ర్ రిలీజ్ చేసిన 3 గంట‌ల 5 నిమిషాల్లో 1 మిలియ‌న్ వ్యూస్ సాధించి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఏదైనా న‌చ్చితేనే చేస్తాను...న‌చ్చితేనే చూస్తాను.
కాద‌ని బ‌ల‌వంతం చేస్తే...కోస్తా...ఎ స్వీట్ వార్నింగ్ అంటూ మెగాస్టార్ చెప్పిన డైలాగ్ మాస్ కి బాగా క‌నెక్ట్ అవుతుంది. ఈ టీజ‌ర్ లో చిరు లుక్స్ చూస్తుంటే... 1990 టైమ్ లో చూసిన మెగాస్టార్ ని చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది అంటూ ఫ్యాన్స్ చాలా ఖుషీగా ఉన్నారు. క్రిస్మ‌స్ కానుక‌గా ఆడియోను చాలా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

More News

'సింగం3' ఆడియో రిలీజ్ డేట్ ' ప్లేస్ మారింది...

తమిళం,తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్ ను,మార్కెట్ ను సంపాందించుకున్న వెర్సటైల్ కథానాయకుడు సూర్య

మాస్ ను ఆకట్టుకుంటున్న చిరు స్వీట్ వార్నింగ్..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన 150వ చిత్రం ఖైదీ నెం150.

డిసెంబర్ 30న తెలుగు, తమిళ భాషల్లో పిజ్జా - 2

వరుస విజయాలతో దూకుడు మీదున్న తమిళ పాపులర్ హీరో విజయ్ సేతుపతి తమిళంలో నటిస్తున్న చిత్రం పురియత్ పుధీర్.

నా బెస్ట్ సెల్ఫీ ఇదే - అల్లు అర్జున్..!

బెంగుళూరు బ్లాష్టర్స్ జట్టుకు అల్లు అర్జున్ సహయాజమానిగా వ్యవహరిస్తున్నారు.

బాలయ్య సినిమాల టైటిల్స్ తో అల్లుడు సింగంలో సాంగ్..!

బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతికి ముందే స్పెషల్ ధమకా.గతంలో నందమూరి తారక రామారావు గారి సినిమాల టైటిల్స్ తో