ఖైదీ నెం150 టీజర్ రికార్డ్..!
Friday, December 9, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 8 సాయంత్రం రిలీజ్ చేసిన ఖైదీ నెం 150 టీజర్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. టీజర్ రిలీజ్ చేసిన 3 గంటల 5 నిమిషాల్లో 1 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఏదైనా నచ్చితేనే చేస్తాను...నచ్చితేనే చూస్తాను.
కాదని బలవంతం చేస్తే...కోస్తా...ఎ స్వీట్ వార్నింగ్ అంటూ మెగాస్టార్ చెప్పిన డైలాగ్ మాస్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ టీజర్ లో చిరు లుక్స్ చూస్తుంటే... 1990 టైమ్ లో చూసిన మెగాస్టార్ ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది అంటూ ఫ్యాన్స్ చాలా ఖుషీగా ఉన్నారు. క్రిస్మస్ కానుకగా ఆడియోను చాలా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments