ఖైదీ నెం 150 టీమ్ స్పెషల్ వీడియో అదిరింది..!

  • IndiaGlitz, [Monday,August 22 2016]

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150 చిత్రానికి టైటిల్ ఖైదీ నెం 150 అంటూ క్లారిటీ ఇచ్చేసారు. అయితే...మెగాస్టార్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మెగాస్టార్ హ్యాపీ బ‌ర్త్ డే అంటూ ఖైదీ నెం 150 టీమ్ స్పెష‌ల్ వీడియో రిలీజ్ చేసింది. 149 చిత్రాల ధీరుడు, 37 సంవ‌త్స‌రాలు పాలించిన చ‌క్ర‌వ‌ర్తి, కోట్ల హృద‌యాల‌ను గెలుచుకున్న విజేత అంటూ మెగాస్టార్ 150వ చిత్రం గురించి రిలీజ్ చేసిన స్పెష‌ల్ వీడియో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది.
తోట త‌ర‌ణి క‌ళ, ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ, రాక్ స్టార్ దేవిశ్రీ మ్యూజిక్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మాణం, డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం వ‌స్తుంద‌ని చెప్పారు. అయితే...ఈ స్పెష‌ల్ వీడియోలో మూవీ టైటిల్ ఎనౌన్స్ చేయ‌లేదు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ రిలీజ్ చేసిన ఈ స్పెష‌ల్ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఇక ఖైదీ నెంబ‌ర్ 150 మోష‌న్ పోస్ట‌ర్ కోసం వెయిట్ చేస్తున్నారు. మ‌రి...ఖైదీ నెం 150 మోష‌న్ పోస్ట‌ర్ ఏరేంజ్ లో ఉంటుందో చూడాలి..!

More News

బాహుబలి2 వ్యవథి ఎంతంటే...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న బాహుబలి పార్ట్ 2

కమల్ కు అరుదైన పురస్కారం...

విలక్షణ నటుడు కమల్ హాసన్ అంటే పరిచయం అవసరం లేని పేరు.

కామెడీ & రొమాంటిక్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జో అచ్యుతానంద బిగ్ హిట్ అవుతుంది - రాజ‌మౌళి

నారా రోహిత్ - నాగ శౌర్య - రెజీనా కాంబినేష‌న్లో అవ‌స‌రాల శ్రీనివాస్ తెర‌కెక్కిస్తున్న చిత్రం జో అచ్యుతానంద‌. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్నజో అచ్యుతానంద చిత్రానికి క‌ళ్యాణి మాలిక్  సంగీతం అందించారు.

'చుట్టాలబ్బాయి' బావున్నాడు - కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు

లవ్లీ రాక్స్టార్ ఆది, నమితా ప్రమోద్ జంటగా శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై వీరభద్రమ్ దర్శకత్వంలో నవ నిర్మాతలు వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి సంయుక్తంగా నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం 'చుట్టాలబ్బాయి`.

లడక్ లో సాంగ్స్ పూర్తి చేసుకున్న 'ఇది నా లవ్ స్టోరీ'

తరుణ్,ఓవియా జంటగా రామ్ ఎంటర్ టైనర్స్ బ్యా నర్ పై రమేష్ గోపి దర్శకత్వం లో అభిరామ్ సమర్పణలో