ఖైదీ నెం 150 టీమ్ స్పెషల్ వీడియో అదిరింది..!

  • IndiaGlitz, [Monday,August 22 2016]

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150 చిత్రానికి టైటిల్ ఖైదీ నెం 150 అంటూ క్లారిటీ ఇచ్చేసారు. అయితే...మెగాస్టార్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మెగాస్టార్ హ్యాపీ బ‌ర్త్ డే అంటూ ఖైదీ నెం 150 టీమ్ స్పెష‌ల్ వీడియో రిలీజ్ చేసింది. 149 చిత్రాల ధీరుడు, 37 సంవ‌త్స‌రాలు పాలించిన చ‌క్ర‌వ‌ర్తి, కోట్ల హృద‌యాల‌ను గెలుచుకున్న విజేత అంటూ మెగాస్టార్ 150వ చిత్రం గురించి రిలీజ్ చేసిన స్పెష‌ల్ వీడియో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది.
తోట త‌ర‌ణి క‌ళ, ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ, రాక్ స్టార్ దేవిశ్రీ మ్యూజిక్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మాణం, డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం వ‌స్తుంద‌ని చెప్పారు. అయితే...ఈ స్పెష‌ల్ వీడియోలో మూవీ టైటిల్ ఎనౌన్స్ చేయ‌లేదు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ రిలీజ్ చేసిన ఈ స్పెష‌ల్ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఇక ఖైదీ నెంబ‌ర్ 150 మోష‌న్ పోస్ట‌ర్ కోసం వెయిట్ చేస్తున్నారు. మ‌రి...ఖైదీ నెం 150 మోష‌న్ పోస్ట‌ర్ ఏరేంజ్ లో ఉంటుందో చూడాలి..!