ఓవర్ సీస్ లో ఖైదీ నెం 150 సంచలనం..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ వసూలు చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా సంచలనం సృష్టిస్తుంది. ఓవర్ సీస్ లో ఖైదీ నెం 150 తొలిరోజే మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.
మెగాస్టార్ ఖైదీ నెం 150 12,51,548 డాలర్లు వసూలు చేసిందని తరణ్ ఆదర్శ్ తెలియచేసారు. అంటే మన లెక్కల ప్రకారం 8.56 కోట్లు. వీకెండ్ లో ఈ కలెక్షన్స్ మరింతగా పెరుగుతాయి. ప్రీమియర్ షోలో ఖైదీ నెం 150 రికార్డ్ క్రియేట్ చేసి టాప్ 5 లో 2 స్ధానం దక్కించుకోవడం విశేషం. బాహుబలి 1363 డాలర్స్ తో మొదటి స్ధానంలో ఉండగా, 1251 డాలర్స్ తో ఖైదీ నెం 150 రెండో స్ధానంలో, 643 డాలర్స్ తో సర్ధార్ గబ్బర్ సింగ్ మూడవ స్ధానంలో, 585 డాలర్స్ తో జనతా గ్యారేజ్ నాలుగవ స్ధానంలో, 565 డాలర్స్ తో శ్రీమంతుడు ఐదవ స్ధానంలో నిలిచాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments