ఖైదీ నెం 150 రిలీజ్ డేట్ & టార్గెట్ ఫిక్స్..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెం 150 చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. జనవరి 4న ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతికి ముందుగా బాలయ్య నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకున్నారు.
కానీ...తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ ఖైదీ నెం 150 సినిమాని ముందుగా రిలీజ్ చేయనున్నట్టు తెలిసింది. జనవరి 11న ఖైదీ నెం 150 చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. యు.ఎస్ లో జనవరి 10న ప్రీమియర్ షోస్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక టార్గెట్ విషయానికి వస్తే...ఫస్ట్ వీక్ లో 60 కోట్లు షేర్ సాధించాలనేది టార్గెట్ గా పెట్టుకున్నారట. జనవరి 1 నుంచి భారీ స్ధాయిలో పబ్లిసిటీ చేసేందుకు పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు. మరి...ఫస్ట్ వీక్ లో టార్గెట్ ను ఎంత వరకు చేరుకుంటారో..? ఫైనల్ గా ఖైదీ నెం 150 ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com