'ఖైదీ నంబర్ 150' ఓవర్ సీస్ హక్కులను...

  • IndiaGlitz, [Monday,November 28 2016]

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియ‌స్ 150వ చిత్రం ఖైదీ నంబ‌ర్ 150 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం త‌మిళ హిట్ చిత్రం 'కత్తి'కి రీమేక్‌. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ ఈ సినిమాను నిర్మిస్తుంటే, 'ఠాగూర్' త‌ర్వాత వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో చిరు న‌టిస్తున్న చిత్ర‌మిది. దాదాపు ఎమిదేళ్ల త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమా ప్రీ రిలీజ్ బిజిన‌స్‌తో పాటు ఓవ‌ర్‌సీస్ హ‌క్కులు భారీ రేటు అమ్ముడైపోయాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా ఓవ‌ర్‌సీస్ హ‌క్కుల‌ను మైత్రి మూవీస్ ఫ్యాన్సీ రేటు హ‌క్కుల‌ను ద‌క్కించుకుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే అధికార‌క స‌మాచారం రానుంద‌ట‌.