ఓవర్ సీస్ లో ఖైదీ నెం150 సంచలనం..!
- IndiaGlitz, [Sunday,January 08 2017]
మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150. డైనమిక్ డైరెక్టర్ వినాయక్ ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. పదేళ్ల వెయిటింగ్ తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు మెగాస్టార్. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. చిరు డ్యాన్స్ మూమెంట్, కామెడీ, ఫైట్స్..చూడకుండా పదేళ్లు గడిచిపోయాయి అంటే ఆశ్చర్యంగానే ఉంది. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు చిరును తెరపై చూస్తామా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందరి అంచనాలకు తగ్గట్టు వి.వి.వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వినాయక్ టేకింగ్, దేవిశ్రీ మ్యూజిక్, లారెన్స్ కొరియోగ్రఫీ, రత్నవేలు కెమెరావర్క్ కలిస్తే ఇక సినిమా ఏరేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం రిలీజ్ కి ముందే సంచలనం సృష్టిస్తుంది ఖైదీ నెం 150.
యు.ఎస్ లో 225 కు పైగా థియేటర్స్ లో ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఇప్పటి వరకు ఏ సౌతిండియా హీరో సినిమాను ఇన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయలేదు. క్లాసిక్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఓవర్ సీస్ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తుంది. లాస్ ఏంజిల్స్ లో 9కి పైగా థియేటర్స్ లో తెలుగు సినిమాని రిలీజ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. అలాగే సి.ఎలో 25కి పైగా థియేటర్స్ లో, సిట్టలి ఏరియాలో 5కి పైగా థియేటర్స్ లో, విఏ లో 12పైగా థియేటర్స్ లో , అలాగే న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్ లో రికార్డ్ స్ధాయి థియేటర్స్ లో ఖైదీ నెం 150 చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. 50 కి పైగా లగ్జరీ సిటింగ్స్ ఉన్న థియేటర్స్ లో ఇండియన్ మూవీ రిలీజ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ విధంగా రిలీజ్ కి ముందే ఓవర్ సీస్ లో సంచలనం సృష్టిస్తున్న ఖైదీ నెం 150 రిలీజ్ తర్వాత ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి..!