ఖైదీ నెం 150 నెక్ట్స్ షెడ్యూల్ డీటైల్స్..!
Tuesday, November 22, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. డైనమిక్ డైరెక్టర్ వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల యూరప్ లో చిరంజీవి, కాజల్ పై రెండు పాటలను చిత్రీకరించారు. జానీ & శేఖర్ మాస్టర్స్ నృత్య దర్శకత్వంలో ఈ రెండు పాటలను చిత్రీకరించారు. నెక్ట్స్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్టు సమాచారం.
ఈ తాజా షెడ్యూల్ లో కోర్టు సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ కోర్టు సీన్స్ , డైలాగ్స్ సినిమాకి హైలైట్స్ గా నిలిచేలా రూపొందిస్తున్నారట. ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఖైదీ నెం 150 ఆడియోను డిసెంబర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పై రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments