ఖైదీ నెం 150 నెక్ట్స్ షెడ్యూల్ డీటైల్స్..!

  • IndiaGlitz, [Tuesday,November 22 2016]

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150 శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌ల యూర‌ప్ లో చిరంజీవి, కాజ‌ల్ పై రెండు పాట‌ల‌ను చిత్రీక‌రించారు. జానీ & శేఖ‌ర్ మాస్ట‌ర్స్ నృత్య ద‌ర్శ‌క‌త్వంలో ఈ రెండు పాట‌ల‌ను చిత్రీక‌రించారు. నెక్ట్స్ షెడ్యూల్ ను హైద‌రాబాద్ లో ప్లాన్ చేసిన‌ట్టు స‌మాచారం.
ఈ తాజా షెడ్యూల్ లో కోర్టు స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఈ కోర్టు సీన్స్ , డైలాగ్స్ సినిమాకి హైలైట్స్ గా నిలిచేలా రూపొందిస్తున్నార‌ట‌. ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఖైదీ నెం 150 ఆడియోను డిసెంబ‌ర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ పై రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

More News

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న మంచు విష్ణు 'లక్కున్నోడు'

వెర్సటైల్ యాక్టర్ మంచు విష్ణు, బబ్లీ బ్యూటీ హన్సిక మోత్వాని జంటగా రూపొందుతోన్న ఎంటర్టైనర్ `లక్కున్నోడు`. ఎం.వి.వి.సినిమా బ్యానర్పై ఎం.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీపార్ట్ను పూర్తి చేసుకుంది.

రేపటి నుండి నాని సినిమా...

నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు.

డాక్టరుగా హెబ్బా పటేల్.....

అలా ఎలా,కుమారి 21ఎఫ్,ఈడోరకం-ఆడోరకం చిత్రాల తర్వాత ఇప్పుడు ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో సక్సెస్ తో హెబ్బా పటేల్ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.

కల్యాణ్ రామ్ చూపు అతనివైపు...

ఇజం సినిమా కోసం హీరో కల్యాణ్ రామ్ బాగానే కష్టపడ్డాడు.లుక్ పరంగా కొత్తగా కనపడటానికి సిక్స్ ప్యాక్ చేశాడు.

టర్కీ నుండి 'విన్నర్ ' బ్యాక్....

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్,గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందుతోన్నచిత్రం 'విన్నర్'.