గల్ఫ్ లో పర్స్ & ఎకెఎస్ గ్లోబల్ మీడియా ద్వారా ఖైదీ నెం 150 రిలీజ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150. ఈ యాక్షన్ డ్రామాను డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తెరకెక్కించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించారు. ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేసారు. ఇక కథానాయికగా కాజల్ అగర్వాల్ నటించిన విషయం తెలిసిందే. కామెడీ కింగ్ ఆలీ కీలక పాత్ర పోషించారు.
తొమ్మిది సంవత్సరాల తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ భారీ చిత్రాన్ని గల్ఫ్ లో పర్స్ & ఎకెఎస్ గ్లోబల్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పర్స్ & ఎకెఎస్ గ్లోబల్ మీడియా సంస్థ రమేష్ మరియు సరిగమ సినిమాస్ తేజుకు స్పెషల్ థ్యాంక్స్ తెలియచేసారు. ఈ భారీ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 11న రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments