ఖైదీ నెం 150 ఫస్ట్ వీక్ గ్రాస్ 108 కోట్ల 48 లక్షలు - అల్లు అరవింద్..!
- IndiaGlitz, [Wednesday,January 18 2017]
మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150. వి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా రిలీజైన ఖైదీ నెం 150 చిత్రం రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ...నాలుగు రోజుల్లో కృతజ్ఞతాభినందన సభ ఏర్పాటు చేస్తున్నాం.ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే... ఫాస్ట్ గా 100 కోట్లు వసూలు చేసిన సినిమాగా ఈ చిత్రం నిలిచింది. 7 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 76 కోట్ల 15 లక్షల 4 వేలు వసూలు చేసింది. కర్నాటక 9 కోట్లు, నార్త్ ఇండియాలో 1కోటి 43 లక్షలు, నార్త్ అమెరికాలో 17 కోట్లు, రెస్టాఫ్ ది వరల్డ్ 3 కోట్ల 90 లక్షలు, తమిళనాడులో 60 లక్షలు...మొత్తం కలిపి ఫస్ట్ వీక్ 108 కోట్ల 48 లక్షలు గ్రాస్ వసూలు చేసింది. చిరంజీవి గార్ని చాలా చక్కగా చూపించ గల కొద్ది మంది సమర్ధుల్లో వినాయక్ ఒకరు. బాస్ ని బాగా చూపించడంలో వినాయక్ సక్సెస్ అయ్యారు అన్నారు.
వినాయక్ మాట్లాడుతూ...ప్రతి విషయంలో మా వెనకుండి అల్లు అరవింద్ గారు మమ్మల్ని ముందుకు నడిపించారు. అన్నయ్య 150వ సినిమా నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో చెప్పడానికి మాటలు లేవు. చాగల్లులో నిజమైన సంక్రాంత జరుపుకున్నాం. చిరంజీవి గారి పై లోలోప ఉన్న ప్రేమను ప్రేక్షకులు కలెక్షన్స్ రూపంలో చూపిస్తున్నారు. అమెరికా నుంచి చిన్న ఊరు వరకు అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి.మా ఊరులో 5 లక్షలు వస్తే చాలా ఎక్కువ అలాంటిది నిన్నటికి 7 లక్షలు వసూలు చేసింది. నాకు కత్తిలాంటి కథను ఇచ్చిన మురుగుదాస్ గారి ధ్యాంక్స్ తెలియచేస్తున్నాను.
చిరంజీవి గార్ని చూస్తుంటే చూడాలనివుంది సినిమాలో చిరంజీవి గార్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. నేనే కాదు అందరూ ఇదే మాట అంటున్నారు. నాకు ఇంకా ఈ సినిమా నిన్నే రిలీజైన ఫీలింగ్ కలుగుతుంది. ఈరోజు కూడా హౌస్ ఫుల్స్ అయ్యాయి అంటే మామూలు విషయం కాదు. దేవిశ్రీప్రసాద్ ఇళయరాజా, కీరవాణి స్ధాయిలో సంగీతం అందించాడు. రత్నవేలు, తోట తరణి, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గౌతంరాజు గారు, పరుచూరి బ్రదర్స్, సాయిమాధవ్, సత్యానంద్..ఇలా అందరూ చాలా ఇష్టంతో ఈ సినిమాకి వర్క్ చేయడం వలనే ఇంత మంచి అవుట్ ఫుట్ వచ్చింది. చిరంజీవి గారు అయితే...ఈ సినిమా కోసం కఠోర దీక్ష చేసారు. ఆయన రైస్ తిని చాలా రోజులు అయ్యింది. సినిమా ప్రారంభించినప్పుడు చాలా మందికి రైతులు గురించి చిరంజీవి గారు చెబితే వింటారా..? ఇంతకు ముందులా డ్యాన్స్ చేయగలరా..? అనే సందేహం ఉండేది. అలాంటి అనుమానాలన్నింటికి ఫస్ట్ షాట్ తో సమాధానం చెప్పారు.
కొంత మంది చిరంజీవి అభిమానులు నైజాం, కృష్ణ, సీడెడ్ లో అన్యాయం జరిగింది అని బాధపడుతున్నారు. ఎవరూ బాధపడద్దు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయాలో అంత కలెక్ట్ చేస్తుంది. అభిమానులు ఎవరూ కూడా రాంగ్ వార్డ్స్ వాడద్దు అని కోరుతున్నాను. నిజంగానే బాస్ ఈజ్ బ్యాక్ అనిపించారు. చిరంజీవి గారు నెక్ట్స్ మూవీలో ఇంకా చాలా యంగ్ గా ఉంటారు. ఈ సినిమాతో చిరంజీవి గారిలో కొత్త ఉత్సాహం వచ్చింది. సురేఖ వదిన సమర్పణలో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్ లో కొణిదెల అని బ్యానర్ పేరు పడగానే విజిల్స్ వేస్తున్నారు. ఈ చిత్రం గురించి ట్వీట్ చేసిన మహేష్, రాజమౌళికి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ థ్యాంక్స్ అన్నారు.