ఖైదీ నెం150 సెన్సార్ కంప్లీట్..!

  • IndiaGlitz, [Thursday,December 29 2016]

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 150వ చిత్రం ఖైదీ నెం 150. చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింది. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఖైదీ నెం 150 చిత్రం ఈరోజు సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మించిన ఖైదీ నెం 150 ఆడియోను జ‌న‌వ‌రి 1న డైరెక్ట్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేయ‌నున్నారు. జ‌న‌వ‌రి 4న ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ విజ‌య‌వాడ‌లో ప్లాన్ చేసారు. చిరంజీవి కెరీర్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా భారీ స్ధాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.