న్యూ టెక్నాల‌జీతో ఖైదీ నెం 150 ఆడియో రిలీజ్..!

  • IndiaGlitz, [Friday,December 02 2016]

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150 చిత్రం ఖైదీ నెం 150 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ భారీ చిత్రాన్ని మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఇక ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ ను ఈ నెల‌లోనే ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ ను క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో చేసేందుకు ప‌క్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు.

టాలీవుడ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చేయ‌ని విధంగా డి హోలోగ్రామ్ అనే న్యూ టెక్నాల‌జీతో ఈ వేడుక‌ను చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ మూవీ ట్రైల‌ర్ తో పాటు సాంగ్స్ ప్రొమోస్ ను కూడా ఈ టెక్నాల‌జీ ద్వారానే ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ లో రిలీజ్ చేస్తార‌ట‌. ఇంత‌కీ ఏమిటి ఈ న్యూ టెక్నాల‌జీ అంటే...ఈ టెక్నాల‌జీ ద్వారా ఏవైనా క‌ళ్ల ముందు ఉన్న‌ట్టే ఉంటాయి. దీని ద్వారా ఒక కొత్త అనుభూతి క‌లుగుతుంది అంటున్నారు. అది సంగ‌తి..!