ఖాదర్ ఖాన్‌కు తీవ్ర అస్వస్థత
- IndiaGlitz, [Friday,December 28 2018]
‘జుదాయి, జుడ్వా, అనారీ నెం.1, ముజ్‌సే షాదీ కరోగీ’ సినిమాల్లో తనదైన నటనతో మెప్పించిన బాలీవుడ్ నటుడు ఖాదర్‌ఖాన్. ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం కెనడాలో ఉన్న ఆయునకు శ్వాస సంబంధిత సమస్య రావడంతో దగ్గరల్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన్ని వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఆయన కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని సమాచారం.