రంగంలోకి రాఖీ భాయ్.. అమ్ముడైన కేజిఎఫ్ 2 ఆడియో రైట్స్

  • IndiaGlitz, [Thursday,July 01 2021]

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ నటించిన కేజిఎఫ్ చిత్రం ఇండియా మొత్తం సంచలన విజయం సాధించింది. దీనితో కేజిఎఫ్ చాప్టర్ 2పై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. కేజిఎఫ్ 2 గత ఏడాది అక్టోబర్ లోనే రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడుతూ వచ్చింది.

ఇంతవరకు చిత్ర యూనిట్ తదుపరి రిలీజ్ డేట్ ప్రకటించలేదు. అంతపెద్ద చిత్రం, పైగా భారీ అంచనాలు ఉన్నాయి..కానీ చిన్నపాటి ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదు. దీనితో కెజిఎఫ్ అభిమానుల్లో చిన్నపాటి అసంతృప్తి నెలకొని ఉంది.

ఇదీ చదవండి: అభిమానుల్లో మొదలైన అసహనం.. ఇప్పుడు వెంకటేష్, తర్వాత ఎవరో!

ఎట్టకేలకు నిర్మాతలు కెజిఎఫ్ 2 విషయంలో ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్ర ఆడియో హక్కులని ప్రముఖ లహరి, టి సిరీస్ సంస్థలు దక్కించుకున్నాయి. భారీ మొత్తానికి ఆడియో హక్కులు మొదలైనట్లు తెలుస్తోంది. ఇక కేజిఎఫ్ 2 రిలీజ్ డేట్ విషయంపై కూడా మేకర్స్ కసరత్తులు మొదలుపెట్టారట.

సెప్టెంబర్ 9న రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నిర్మాతలు మాత్రం ఇంకా రిలీజ్ డేట్ ని ఫైనల్ చేయలేదు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు టాక్. తొలి భాగంలో గరుడని అంతమొదించిన రాఖీ భాయ్ కెజిఎఫ్ 2 తో రంగంలోకి దిగే సమయం ఆసన్నమైంది.