ఇండియన్ సినిమా స్థాయిని పెంచే 'కేజీఎఫ్'.. ఐదు భాషల్లో ట్రైలర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మాతగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కేజీఎఫ్(కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)’. ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలన చిత్ర బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం బెంగళూరులో శుక్రవారం ఘనంగా జరిగింది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఏక కాలంలో ట్రైలర్‌ను విడుదల చేశారు. డిసెంబర్ 21న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నటుడు అంబరీష్ విచ్చేశారు.
కన్నడ ట్రైలర్ విడుదల చేసిన సీనియర్ నటుడు అంబరీష్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం ట్రైలర్ చాలా గ్రాండ్‌గా ఉంది. కన్నడ సినిమా స్థాయిని ఇండియన్ సినిమా స్థాయికి పెంచేలా ఉంది. డైరెక్టర్ ప్రశాంత్, ప్రొడ్యూసర్ విజయ్‌కు అభినందనలు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నా.’’ అన్నారు.
తెలుగు ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత, వారాహిచలన చిత్రం బ్యానర్ అధినేత సాయికొర్రపాటి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను బళ్లారి నుంచి హైదరాబాద్ వెళ్లి నిర్మాతగా మారాను. నేను ఎప్పటి నుంచో ఒక కన్నడ సినిమా చేయాలనుకుంటున్నాను. ఈ సినిమాతో కన్నడ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాను. తెలుగులో మా వారాహి చలన చిత్రం బ్యానర్‌పై ఈ చిత్రాన్ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా పెద్ద విజయం సాధిస్తుందని బలంగా నమ్ముతున్నాను.’’ అన్నారు.
తమిళ ట్రైలర్‌ను విడుదల చేసిన హీరో విశాల్ మాట్లాడుతూ.. ‘యష్‌తో చాలా కాలంగా నాకు అనుబంధం ఉంది. నాకు సోదరుడితో సమానం. కేజీఎఫ్‌తో కన్నడ సినిమా.. ప్యాన్ ఇండియా మూవీగా నిలుస్తుంది. భాషా పరమైన సరిహద్దులను ఈ సినిమా చెరిపేస్తుంది. బాహుబలితో ఇది వరకే ఈ విషయం నిరూపితమైంది. ఇప్పుడు కేజీఎఫ్‌తో మారోసారి రుజువుకాబోతోంది. ఈ సినిమా ప్రేక్షకులకు చాలా పెద్ద ట్రీట్ అవుతుంది. నేను కోలార్ ప్రాంతంలో 3 ఏళ్లు పని చేశాను. నాకు కన్నడం అంటే అభిమానం. ఆర్ట్ డైరెక్టర్ చాలా కీ రోల్ పోషించారు. అమేజింగ్ జాబ్. తమిళంలో నా బ్యానర్ ద్వారా ఈ సినిమాను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. యష్ ఈ సినిమా కోసం నిర్విరామంగా పని చేశాడు. 1000 రోజులు ఒక సినిమా కోసం పని చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. చాలామంది కష్టం దాగి ఉంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి.. టీమ్ అందరికీ మంచి పేరు రావాలి.’’ అన్నారు.
హిందీ ట్రైలర్‌ను విడుదల చేసిన ఏఏ ఫిల్మ్స్ అధినేత అనిల్ తాండన్ మాట్లాడుతూ..‘‘బాహుబలి, రోబో లాంటి భారీ సినిమాల తర్వాత నేను విడుదల చేస్తున్న సౌతిండియన్ మూవీ ఇది. ఇది కూడా భారీ విజయం సాధిస్తుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు.
దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ‘‘ నా తొలి సినిమా ‘ఉగ్రం’. ఆ సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు హిట్ అవుతుందో లేదో అనుకున్నాను. కానీ అది చాలా పెద్ద హిట్ అయింది. దాంతో నాకు నమ్మకం కుదిరింది. అదే నమ్మకంతో నిర్మాత విజయ్ గారు కేజీఎఫ్ మూవీ చేయడానికి ముందుకొచ్చారు. నాలుగేళ్ల జర్నీ ఈ సినిమా. మొదట కన్నడలోనే విడుదల చేద్దాం అనుకున్నాం. కానీ ప్రొడ్యూసర్ ఈ సినిమా చూశాక తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయాలనుకున్నారు. దీంతో విశాల్, సాయికొర్రపాటి, అనిల్ తాండన్.. ఆయా భాషల్లో సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకు రావడంతో సినిమా స్పాన్ పెరిగింది. నా నాలుగేళ్ల కల సాకారమైంది. నిర్మాత విజయ్ గారు, హీరో యష్ సహా యూనిట్ అందరూ ఎంతో సహాయం చేశారు. ఇది చాలా గ్రేట్ సినిమా అవుతుందనే నమ్మకం ఉంది.’’ అన్నారు.
నిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ.. ‘‘అందరూ ఈ సినిమా బడ్జెట్ ఎంత అని అడుగుతున్నారు.. నాకు డబ్బు ముఖ్యం కాదు.. బంధాలే ముఖ్యం. నేను ఒక సినిమా చేసే టప్పుడు అది ఇండస్ట్రీలో ఒక చరిత్ర సృష్టించాలి. కొత్త ట్యాలెంట్ బయటకు రావాలనే ఆలోచనతో చేస్తాను. అలాంటి ఆలోచనతో చేసిన సినిమా కేజీఎఫ్. ప్రశాంత్ అద్భుతమైన డైరెక్టర్. ప్రతీ సన్నివేశాన్నీ ఒక విజువల్ ట్రీట్‌గా అందించారు. అలాగే యష్ నా తమ్ముడి లాంటి వాడు. ఈ సినిమా కోసం తను చాలా కష్టపడ్డాడు. నిర్మాతగా ఇది నాకో గొప్ప చిత్రం అవుతుంది.’’ అన్నారు.
హీరో రాకింగ్ స్టార్ యష్..‘‘నా తొలి సినిమా ‘రామాచారి’ కంటే ఈ సినిమా ముందే పూర్తి కావాల్సింది. మంచి అవుట్ పుట్ కోసం బాగా కష్టపడ్డాం. ఇప్పటికి పూర్తయింది. డిసెంబర్ 21న ఐదు భాషల్లో సినిమా విడుదల అవుతుంది. రాబోయే రోజుల్లో ఇండియన్ సినిమాలో ప్రశాంత్ పేరు గుర్తుండి పోతుంది. ఈ సినిమాకి అసలు హీరో నేనుకాదు.. నిర్మాత విజయ్ గారు. ఇలాంటి స్టోరీని కాంప్రమైజ్ కాకుండా మాపై నమ్మకంతో ఎంతో ఓపికగా ఉండి పూర్తి చేశారు. ఆయన లేకుంటే ఈ సినిమా ఇంత భారీ చిత్రంగా తెరకెక్కేది కాదు. సినిమాటోగ్రాఫర్ భువన్ అద్భుతమైన విజువల్స్ అందించారు.
హాలీవుడ్ రేంజ్లో ఆయన తన పనితనాన్ని ప్రదర్శించారు. అలాగే ఆర్ట్ వర్క్‌ను చూస్తే అందమైన క్యాన్వాస్‌లో సినిమా చూసినట్టుంటుంది. నేనే హార్డ్ వర్కర్ అనుకుంటే ఆర్ట్ డైరెక్టర్ నాకంటే ఎక్కువగా కష్టపడ్డారు. ఈ సినిమాలో కొన్ని క్లిప్పింగ్స్ చూసి ఈ సినిమాను ఆయా భాషల్లో విడుదల చేయడానికి ముందుకు వచ్చిన, విశాల్, సాయికొర్రపాటి, అనిల్ తాండన్‌కు ధన్యవాదాలు. అలాగే బాలీవుడ్ స్టార్ట్స్ రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్‌లకు కూడా థ్యాంక్స్. కన్నడ సినిమా స్థాయిని ఇండియన్ సినిమా స్థాయికి తీసుకెళ్లే సినిమా ఇది. అంతేకాకుండా ఇది హాలీవుడ్ రేంజ్ మూవీలా ఉంటుందని నేను బలంగా చెబుతున్నాను. ప్రశాంత్ లాంటి గొప్ప దర్శకుడు, విజయ్ లాంటి గొప్ప నిర్మాత ఉంటే ఒక సినమా కోసం నేను ఎన్ని రోజులైనా పని చేయడానికి సిద్ధంగా ఉంటాను. సినిమా చరిత్రలో కేజీఎఫ్ ఒక్క బిగినింగ్ మాత్రమే.’’ అన్నారు.
ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్ర యూనిట్‌కు కన్నడ సూపర్‌స్టార్ పునిత్ రాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్స్ రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్‌లు వీడియో సందేశం ద్వారా అభినందనలు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments