'స‌లార్‌'లో కేజీయ‌ఫ్ స్టార్‌..!

  • IndiaGlitz, [Tuesday,March 16 2021]

ఇద్ద‌రు ప్యాన్ ఇండియా స్టార్స్ క‌లిసి సినిమా చేస్తుంటే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎంటైర్ ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీ ఈ సినిమా కోసమే ఎదురుచూస్తుంటుంద‌న‌డంలో సందేహ‌మే లేదు. అలాంటి పాన్ ఇండియా సినిమాల్లో ‘స‌లార్’ ఒక‌టి. ఒక‌వైపు ‘బాహుబ‌లి’ స్టార్ ప్ర‌భాస్‌, మ‌రోవైపు ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 1’తో సెన్సేషన్ క్రియేట్ చేసి.. ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’తో మ‌రో సెన్సేష‌న్‌కు సిద్ధమ‌వుతున్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ మ‌రోవైపు..ప్ర‌స్తుతం స‌లార్ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్ప‌టికే భారీ అంచ‌నాల‌తో సినిమాను రూపొందిస్తోన్న హోంబ‌లే ఫిలింస్‌.. ఇప్పుడు మ‌రో స్టార్‌ను ఈ సినిమాలో తీసుకు రావ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ట‌.

వివ‌రాల మేర‌కు కేజీయ‌ఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టిని స‌లార్ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్‌లో న‌ర్తింప చేయాల‌ని ప్ర‌శాంత్‌నీల్ భావిస్తున్నాడ‌ట‌. ప్ర‌భాస్ వంటి స్టార్ చేస్తున్న మూవీ కాబ‌ట్టి.. శ్రీనిధి శెట్టి ఈ సినిమాకు నో చెప్పే ఆస్కారం ఉండ‌దు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న ‘సలార్’ సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.