తెలుగు ఛానెల్‌పై కేసు వేస్తామంటోన్న కేజీయ‌ఫ్ నిర్మాత‌లు

  • IndiaGlitz, [Tuesday,May 12 2020]

క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 1’. ఈ సినిమా రెండో పార్టుగా ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’ సెట్స్‌పై ఉంది. పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి శాటిలైట్ హ‌క్కులు ఇంకా అమ్ముడు కాలేదు. అయితే ఓ తెలుగు లోక‌ల్ ఛానెల్ రీసెంట్‌గా ఈ సినిమాను ప్రేక్ష‌కుల కోసం ప్ర‌ద‌ర్శించింది. దీనిపై కేజీయ‌ఫ్ నిర్మాత‌లు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

దాదాపు త‌మ శాటిలైట్ హ‌క్కులు పూర్తి కావ‌స్తున్న త‌రుణంలో తెలుగు లోక‌ల్ ఛానెల్ త‌మ సినిమాను ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని నిర్మాత‌లు తెలిపారు. స‌ద‌రు లోక‌ల్ ఛానెల్ తమ సినిమాను వారి ఛానెల్‌లో ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు త‌మ వ‌ద్ద ఫొటో, వీడియో ప్రూఫ్‌లున్నాయన్నారు. ఈ విష‌యాన్ని కేజీయ‌ఫ్ నిర్మాత‌లు ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు. ప్ర‌స్తుతం కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2 చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. క‌రోనా ప్ర‌భావం లేకుండా ఉండుంటే కేజీయ‌ప్ రెండో పార్ట్ అక్టోబ‌ర్‌లో విడుదల కావాల్సింది. కానీ ఇప్పుడు క‌రోనా ప్ర‌భావంతో సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది.

More News

మ‌హిళా పోలీస్ ఆఫీస‌ర్‌తో చిరు సంభాష‌ణ‌

వ‌ర‌ల్డ్ మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రపంచంలోని అమ్మ‌ల‌కు అభినంద‌న‌లు తెలియ‌చేసిన సంగ‌తి తెలిసిందే. అదే రోజున ఓ మ‌హిళా ఆఫీస‌ర్ మ‌రో మ‌హిళ‌కు

సడలింపులే కొంపముంచాయా.. లాక్ డౌన్ 4.0 పక్కానా!?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మిగతా దేశాలతో పోలిస్తే ఇండియా చాలా బెటర్. ఇందుకు కారణం లాక్ డౌన్.. ఇది ఎవరు ఒప్పుకున్నా..

జగన్ నిర్ణయంపై కేసీఆర్ అభ్యంతరం.. న్యాయపోరాటం!

టైటిల్ చూడగానే ఇదేంటి.. నిన్న మొన్నటి వరకూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి సఖ్యతగా ఉన్నారు కదా..? సడన్‌గా ఏమైంది..? అసలేం జరిగింది..?

క్షమించండి.. రాజకీయాలొద్దు.. సినిమాలే ముద్దు!

అవును మీరు వింటున్నది నిజమే.. టాలీవుడ్ నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తన తప్పును తెలుసుకుని తన అభిమానులు, సినీ ప్రియులకు క్షమాపణలు చెప్పాడు.

సన్నీ.. ముంబై దాటి అమెరికా ఎలా వెళ్లింది!?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇండియాలో రోజురోజుకు విస్తరిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.