క్లైమాక్స్‌ ఫైట్‌ చిత్రీకరణలో 'కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2'

  • IndiaGlitz, [Monday,December 07 2020]

ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో విడుదల కావాల్సిన ప్యాన్‌ ఇండియా మూవీ 'కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2' .. కరోనా వైరస్‌ దెబ్బకు ఆగింది. లాక్‌డౌన్‌ తర్వాత పునః ప్రారంభమైన ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కన్నడ స్టార్‌ హీరో యష్‌ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రాన్నిహోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై ప్రశాంత్‌ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా క్లైమాక్స్‌ ఫైట్‌ను రాకీ వర్సెస్‌ అధీర మధ్య చిత్రీకరిస్తున్నామని డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇందలో అధీర పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలు క్రితం సంజయ్‌ దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చింది.

ఆ సమయంలో సంజయ్‌ దత్‌ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారా? అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే సంజయ్‌ దత్‌ క్యాన్సర్‌ను జయించి సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు యష్‌, సంజయ్‌దత్‌లపై ఫైనల్ పార్ట్‌గా ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారు. ఫైట్‌ మాస్టర్స్‌ అన్బు, అరివు ఈ క్లైమాక్స్‌ ఫైట్‌ను డిజైన్‌ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదలపై మేకర్స్‌ ఓ క్లారిటీ ఇవ్వనున్నారు. 'కె.జి.యఫ్ చాప్టర్ 1' భారీ హిట్ తర్వాత దానికి కొనసాగింపుగా వస్తున్న 'కె.జి.యఫ్ చాప్టర్2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

More News

రెండేళ్ల తర్వాత సెట్స్‌పైకి వెళ్లిన దర్శకుడు

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా 'ఆర్‌.ఎక్స్‌ 100' ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం' సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం నుండి ప్రారంభమైంది.

‘ఆర్ఆర్ఆర్’ సెట్స్‌లో అడుగుపెట్టిన ఆలియా..

ప్రభాస్‌తో బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం  ‘రౌద్రం రణం రుధిరం’(ఆర్ఆర్ఆర్).

సింపుల్‌గా సింగర్ సునీత ఎంగేజ్‌మెంట్...

ప్రముఖ గాయని‌ సునీత‌(42) వివాహంపై ఈ మధ్య విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఆమె స్పందించకపోవడంతో అసలు ఆ వార్త నిజమా..

నిహారిక పెళ్లి కోసం రాజస్థాన్‌కు నాగబాబు కుటుంబం...

ఈనెల 9న మెగా డాటర్ నిహారిక వివాహం రాజస్థాన్ ఉదయ్ పూర్‌లో అత్యంత వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే.

తుపాను బాధితులకు అండగా పవన్ దీక్ష..

తెలంగాణలో తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు.