క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణలో 'కె.జి.యఫ్ చాప్టర్ 2'
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది అక్టోబర్ నెలలో విడుదల కావాల్సిన ప్యాన్ ఇండియా మూవీ 'కె.జి.యఫ్ చాప్టర్ 2' .. కరోనా వైరస్ దెబ్బకు ఆగింది. లాక్డౌన్ తర్వాత పునః ప్రారంభమైన ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రాన్నిహోంబలే ఫిలింస్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్‌ను రాకీ వర్సెస్ అధీర మధ్య చిత్రీకరిస్తున్నామని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇందలో అధీర పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలు క్రితం సంజయ్ దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది.
ఆ సమయంలో సంజయ్ దత్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారా? అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే సంజయ్ దత్ క్యాన్సర్‌ను జయించి సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు యష్, సంజయ్దత్లపై ఫైనల్ పార్ట్‌గా ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్స్ అన్బు, అరివు ఈ క్లైమాక్స్ ఫైట్‌ను డిజైన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదలపై మేకర్స్ ఓ క్లారిటీ ఇవ్వనున్నారు. 'కె.జి.యఫ్ చాప్టర్ 1' భారీ హిట్ తర్వాత దానికి కొనసాగింపుగా వస్తున్న 'కె.జి.యఫ్ చాప్టర్2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com