ప్రభాస్‌తో కలిసి స్టెప్పులేసేందుకు సిద్ధమైన ‘కేజీఎఫ్’ బ్యూటీ
Send us your feedback to audioarticles@vaarta.com
‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న చిత్రం ‘సలార్’. కేజీఎఫ్ నిర్మాత విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కేజీఎఫ్ దర్శక నిర్మాత ప్రాజెక్ట్ అవడంతో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. కరోనా నేపథ్యంలో కాస్తా బ్రెక్ ఇచ్చింది చిత్రయూనిట్.
Also Read: తమిళ స్టార్ హీరోతో వంశీ పైడిపల్లి నెక్ట్స్ సినిమా..
ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ప్రభాస్‌తో ‘కె.జి.యఫ్’ హీరోయిన్ శ్రీనిధీ శెట్టి కూడా నటించనున్నారట. అయితే, వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయడం లేదు. కేవలం ఓ పాట చేస్తారట. శ్రీనిధిని హీరోయిన్‌ని చేసిన దర్శకుడే వచ్చి అడగటంతో స్పెషల్ సాంగ్‌కు ముద్దుగుమ్మ సైతం ఓకే చెప్పేసిందట. దీంతో ఈ అమ్మడు ప్రభాస్‌తో కలిసి స్టెప్పులు వేయనుంది. ఈ ఏడాది ఆఖరులో స్పెషల్ సెట్‌లో పాటను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూన్‌లో తదుపరి షెడ్యూల్ స్టార్ట్ చేయాలనుకున్నారు. అయితే, పరిస్థితులను బట్టి అప్పుడు నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు.
వచ్చే ఏడాది వేసవి సందర్భంగా ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ‘బాహుబలి’ తర్వాత రెబల్ స్టార్‌తో సినిమా తీసెందుకు దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలను మాత్రమే చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే రాధకృష్ణ డైరెక్షన్‌లో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూమా పాన్ ఇండియా మూవీగానే రూపొందుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాతోపాటే ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఇందులో రెబల్ స్టార్ రాముడిగా కనిపించనున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments