‘కేజీయఫ్ 2’ టీజర్ డేట్ ఫిక్స్.... బై బై చెప్పిన అధీర
Send us your feedback to audioarticles@vaarta.com
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కేజీయఫ్ చాప్టర్ 2’. దీనికి ముందుభాగం ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ పాన్ ఇండియా మూవీగా విడుదలై బ్లాక్‌బస్టర్ అయ్యింది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రం షూటింగ్ లాక్‌డౌన్ తర్వాత శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా పోస్టర్స్ తప్ప మరే అప్‌డేట్ లేదు. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ‘కేజీయఫ్ చాప్టర్ 2’ టీజర్ డేట్‌ను యూనిట్ ప్రకటించింది. జనవరి 8న టీజర్ విడుదల కానుంది. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ కూడా ఆదివారంతో పూర్తయ్యింది. ఈ ఫైట్‌తో సంజయ్ దత్ పార్ట్‌కు సంబంధించిన షూట్ పూర్తయ్యింది. ఎంటైర్ యూనిట్‌తో సంజూ బాబా ఫొటో దిగారు.
ఒకానొక దశలో సంజయ్ దత్ సినిమాల్లో నటించరేమోనని అందరూ అనుకున్నారు. అందుకు కారణం ఆయనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకడమే. క్యాన్సర్ మూడో దశకు చేరుకుందని, చికిత్స కోసం సంజయ్ దత్ విదేశాలకు వెళతారని వార్తలు వినిపించాయి. అలా వెళితే సంజయ్ దత్ నటిస్తోన్న సినిమాలన్నీ హోల్డ్‌లో పడ్డట్టేనని అందరూ భావించారు. కానీ సంజూ బాబా ముంబైలోనే కీమో థెరపీ చికిత్సను తీసుకుని క్యాన్సర్‌ను జయించి షూటింగ్స్‌లోనూ పాల్గొన్నారు. కె.జి.యఫ్ చాప్టర్ 2లో మెయిన్ విలన్ అధీరగా సంజయ్ దత్ కనిపించనున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌ను కూడా యూనిట్ విడుదల చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com