‘కె.జి.యఫ్ చాప్టర్ 2’ రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుండంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా చరిత్రలో హిట్స్, సూపర్‌హిట్స్, బ్లాక్‌బస్టర్ చిత్రాలు వస్తుంటాయి. కానీ ట్రె్‌ండ సెట్టింగ్ మూవీస్ మాత్రం అరుదుగానే వస్తుంటాయి. అలాంటి అరుదైన ట్రెండ్ సెట్టింగ్ మూవీస్‌లో ‘కె.జి.యఫ్' ఒకటి. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ చిత్రంలో తొలి భాగం ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ కన్నడ చిత్రసీమలో ‘కె.జి.యఫ్’ ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలవడమే కాకుండా పాన్ ఇండియా చిత్రంగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సెన్సేషనల్ హిట్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్‌ను సాధించింది. వసూళ్లలోనే కాకుండా అవార్డుల్లోనూ ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ విజువల్ ఎఫెక్ట్, స్టంట్స్ విభాగాల్లో జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది.
అటు అభిమానులు, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసిన ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’కి కొనసాగింపుగా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2‘ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్‌తో అంచనాలకు ధీటుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.నిజానికి అన్నీ సక్రమంగా జరిగి ఉంటే ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 23న విడుదల కావాల్సింది. కానీ.. విడుదల కాలేదు. కరోనా వైరస్ వల్ల సినిమా షూటింగ్ ఆగింది. సినిమా 80 శాతం పైగా చిత్రీకరణను జరుపుకుంది. మరో నెల రోజులు షూటింగ్ జరుపుకుంటే సినిమా పూర్తయినట్లే. ఈలోపు కరోనా ఎఫెక్ట్ పెరగడంతో షూటింగ్ ఆగింది. ఇప్పుడు షూటింగ్స్‌కు పర్మిషన్స్ దొరికాయి. ఈ నేపథ్యంలో ఆగస్ట్ మూడో వారం నుండి ఈ సినిమా షూటింగ్ జరగనుందని అంటున్నారు. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత సినిమా విడుదలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండో భాగంలో మెయిన్ విలన్ అధీర పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నారు. ఇందిరాగాంధీని పోలిన పాత్రలో రవీనాటాండన్ నటిస్తుండటం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com