కేజీఎఫ్ 2: అధీర ఎలా బతికున్నాడు?
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న ఎంత సెన్సేషన్‌ను క్రియేట్ చేసిందో... ప్రస్తుతం అధీర ఎలా బతికున్నాడు? అనే ప్రశ్న కూడా అంతే సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తోంది. ‘కేజీఎఫ్ 2’ చిత్రం శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను జనవరి 8న హీరో రాకీ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా అప్పటి ‘కేజీఎఫ్ టైమ్స్’ పత్రిక పేరుతో ఓ పేపరును విడుదల చేసింది. ఆ పేపరులో ‘అధీర ఎలా బతికున్నాడు?’ అనే పేరుతో ఓ ఆర్టికల్ ప్రముఖంగా ప్రచురించబడింది. దీనిలో అధీర ఫోటోతో పాటు..దాడి చేసిన రోజు నాటి ఫోటో.. రాకీ సింహాసనాన్ని అధిష్టించిన ఫోటోను ప్రచురించారు.
రాకీ ఫోటోకి.. ‘చరిత్రకు రాజులు బానిసలు. కానీ, రాకీ చరిత్ర సృష్టించినోడు..’ అని క్యాప్షన్ పెట్టారు. ‘అధీర ఎలా బతికున్నాడు?’ను టైటిల్‌గా ఇచ్చి దాని కింద.. ‘వాడు ఓడిపోడా? వాడికి చావు లేదా? వాడి మీద దాడి ముందే తెలుసుకోగలిగాడా? దేశానికి తెలియాలి’ అనే సబ్ టైటిల్స్‌ను ఇచ్చారు. ‘కేజీఎఫ్ అధిపతి సూర్యవర్థన్ ఆరోగ్యం క్షీణించినప్పుడు తన అధికారాన్ని పెద్ద కొడుకు గరుడకి అప్పజెప్పాడు. ఈ నిర్ణయం అధీర జీర్ణించుకోలేక పోయాడు. అధీర గరుడని చంపుదామనుకుని పన్నిన పన్నాగం విఫలమైంది. గరుడకి ఈ విషయం తెలిసాక అధీరాని అంతం చేయాలనుకున్నాడు. విజయవంతంగా చేసాడు. కానీ.. అన్నీ అనుకున్నట్టే జరిగితే అధీర ఎలా తిరిగొచ్చాడు? చావుని ఎలా జయించాడు?’ అని ఇంట్రో ఇచ్చి పూర్తి కథ చాప్టర్ 2లో కొనసాగించబడుతుందని వెల్లడించారు.
‘తొందర పడితే చరిత్రని సృష్టించలేము.. అలా అని చరిత్రని ప్లాన్ చేసి.. బ్లూ ప్రింట్ తీయలేము’ అనే అందమైన వ్యాఖ్యలతో ఆర్టికల్‌ను ప్రచురించారు. నిజానికి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనేది బాహుబలి 2కి ముందు చాలా మంది ఊహించగలిగారు. కొందరి ఊహలు నిజమయ్యాయి. అయితే కేజీఎఫ్ 2 స్టోరీని మాత్రం ఎవరూ ఊహించలేకపోతున్నారు. అధీర ఎలా బతికున్నాడనేది అంతుపట్టని విషయం. అందుకే ఈ సినిమా ఓ రేంజ్‌లో హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ‘అధీర’గా సంజయ్ దత్ నటిస్తున్నారు. మొత్తానికి 8న ఉదయం 10:18 గంటలకు ‘కేజీఎఫ్ 2’ టీజర్ రాబోతోంది.
Reliving the Era of KGF.#KGFTIMES Volume 3.#KGFChapter2TeaserOnJan8 at 10:18am on @hombalefilms Youtube.@VKiragandur @TheNameIsYash @prashanth_neel @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7@BasrurRavi @bhuvangowda84 @VaaraahiCC @KRG_Connects @SillyMonks pic.twitter.com/Gk8GvT3uQm
— IndiaGlitz™ l తెలుగు (@igtelugu) January 6, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout