ఐపీఎల్ కి దూరమవుతున్న కీలక ఆటగాళ్లు వీరే
Send us your feedback to audioarticles@vaarta.com
12 వ ఐపీఎల్ సీజన్ ను ఎంజాయ్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు కూడా చేరింది. తమ అభిమాన క్రికెటర్ల సిక్స్ ల మోత, వికెట్లు పడగొట్టడాన్ని టీవీల్లో చూస్తూ కేరింతలు కొడుతున్న అభిమానులకు కాస్త చేదు వార్తే ఇది. ప్రపంచ కప్ సమీపిస్తుండటంతో ఇప్పటికే జట్టు సభ్యులను ప్రకటించిన ఇతర దేశాల జట్లు.. ప్రాక్టీస్ కోసం స్వదేశానికి రావాలని తమ క్రికెటర్లకు పిలుపునిచ్చాయి. విండీస్ ఇంకా జట్టును ప్రకటించక పోవడంతో... విండీస్ ఆటగాళ్ళు మినహా... మిగతా విదేశీ క్రికెటర్లు స్వదేశాలకు పయనం కానున్నారు. దీంతో... పలు ఐపీఎల్ జట్లలో కీలగ ఆటగాళ్ళు లేకుండానే మరో సగం ఐపీఎల్ టోర్నీ ముగియనుంది.
మధ్యలోనే ఐపీఎల్ ను వీడే ఆటగాళ్లలో ఎక్కువ మంది బెంగుళూరు, రాజస్థాన్, హైదరాబాద్ కు చెందిన వారు ఉన్నారు. దీంతో ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎక్కువగా నష్టపోనుంది. జట్టు విజయాల్లో కీలకంగా మారిన వార్నర్, బెయిర్ స్టో వెళ్లిపోవడం ఆ టీం కు పెద్ద దెబ్బే. షకి బుల్ హాసన్ కూడా హైదరాబాద్ ను వీడనున్నారు.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ నుంచి... డుప్లేసిస్, ఇమ్రాన్ తాహిర్ ఐపీఎల్ మధ్యలోనే వెళ్తుండగా... ముంబై ఇండియన్స్ నుంచి డికాక్ , బెహ్రెండర్ఫ్ ... కోల్ కతా నుంచి జో డెన్లి ఐపీఎల్ కి బై చెప్పనున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు నుంచి... మొయిన్ అలి, స్తోయినిస్, క్లసీన్,డెల్ స్టెయిన్...రాజస్థాన్ రాయల్స్ నుంచి బట్లర్, స్టీవ్ స్మిత్, బెన్ స్టో క్స్, జోఫ్రా అర్బర్...ఢిల్లీ క్యాపిటల్ నుంచి రాబాడా ఈ సీజన్లో మధ్యలోనే ఐపీఎల్ కి దూరం కానున్నారు. దీంతో అభిమానులు కాస్త నిరాశకు లోను కాక తప్పడం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com