పవన్‌కు వరుస షాక్‌లు.. వైసీపీలో చేరిన కీలకనేత

  • IndiaGlitz, [Tuesday,March 10 2020]

‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్‌లో బిజిబిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు షాకింగ్ వార్త విన్నారు. అదేమిటంటే.. పార్టీకి చెందిన కీలకనేత పసుపులేటి బాలరాజు జనసేనకు రాజీనామా చేసి.. వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వైసీపీ ఎంపీ, కీలకనేత విజయసాయిరెడ్డి సమక్షంలో బాలరాజు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ పార్టీ కండువా కప్పుకున్నారు. వారిద్దరికీ కండువాలు కప్పిన విజయసాయి సాదరంగా ఆహ్వానించారు. కాగా విశాఖపట్నంలో కీలకనేత, మాజీ మంత్రిగా బాలరాజుకు మంచి పలుకుబడి ఉంది. ఆయనకున్న జనాధరణతో కచ్చితంగా 2019 ఎన్నికల్లో బాలరాజు గెలిచేస్తారని కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్స్ జరిగాయి. అయితే.. గత కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఇవాళ విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. బాలరాజు లాంటి కీలకనేత జనసేనకు దూరం కావడం ఊహించని షాక్ అనిచెప్పుకోవచ్చు. షూటింగ్‌లో ఉన్న పవన్ ఈ విషయం తెలుసుకుని ఒకింత కంగుతిన్నారట.

వరుస షాక్‌లు..
కాగా.. 2019 ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున మాజీ మంత్రులు, కీలకనేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పేసి పవన్ సమక్షంగా జనసేన కండువా కప్పుకున్నారు. అయితే ఫలితాల తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలకనేతలు, మాజీ జేడీ లక్ష్మీనారాయణ లాంటి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేయగా తాజాగా మాజీ మంత్రి పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడం పవన్‌కు మింగునపడటం లేదు.

కాగా.. ఈయన బాలరాజు 2019 ఎన్నికల్లో విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి జనసేన తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. అంతేకాదు.. పసుపులేటి బాలరాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్‌కు అత్యంత సన్నిహితుడిగా కూడా మంచి పేరుంది.

More News

ఎన్టీఆర్‌ కొడుకు వదిలితే దూకేసేలా ఉన్నాడుగా..

సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీబిజీగా ఉన్నా ఫ్యామిలీకే ప్రియారిటీ ఇచ్చే హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడన్న సంగతి తెలిసిందే.

కాంగ్రెస్‌కు కోలుకోలేని షాక్.. ఎంపీలో కూలనున్న సర్కార్!

కొన్ని దశాబ్ధాలుగా ఇండియాను ఏలిన కాంగ్రెస్‌కు 2014 తర్వాత అస్సలు కలిసి రావట్లేదు. గత పదేళ్ల నుంచి ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వస్తోంది.

సూప‌ర్‌స్టార్‌ని ఫాలో అవుతున్న మహేశ్..!

ద‌క్షిణాది సూప‌ర్‌స్టార్ ఇమేజ్ ఉన్న ర‌జినీకాంత్‌కు ఆధ్యాత్మిక చింత‌న ఎక్కువ‌. ప్ర‌తి ఏడాది ఆయ‌న హిమాల‌యాల‌కు వెళ్లి వ‌స్తుంటారు.

107పై ఫోక‌స్ పెడుతున్న బాల‌కృష్ణ‌

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ 106వ చిత్రం బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఉగాది కానుకగా వ‌స్తోన్న‘ఒరేయ్‌ బుజ్జిగా...`మంచి విజ‌యం సాధించాలి - మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో