Salman Khan: సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో కీలక విషయాలు గుర్తింపు
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ (Salman Khan) ఇంటి వద్ద కాల్పులు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సల్మాన్ నివాసం ఉంటున్న ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో గల గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. తాజాగా ఈ కాల్పులకు సంబంధించిన కీలక విషయం బయటకు వచ్చింది. ఇది తమ పనే అని లారెన్స్ బిష్ణోయ్ ముఠా తెలిపింది. ఇదిలా ఉంటే ఘటన సమయంలో సల్మాన్ ఇంటి ముందు ఉన్న పోలీస్ వాహనం మిస్ అయినట్లు గుర్తించారు.
ఈ ఘటన అనంతరం గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ పేరుతో ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. "సల్మాన్ ఖాన్.. నీకు ట్రైలర్ మాత్రమే చూపించాం. మా సామర్థ్యం ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది. ఇదే నీకు చివరి వార్నింగ్"అని ఆ పోస్ట్‌లో ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే అన్మోల్‌పై 18 క్రిమినల్ కేసులున్నాయి. 2021 అక్టోబరులో జోధ్‌పుర్ జైలు నుంచి విడుదలైన అతడు విదేశాలకు పారిపోయాడు. ప్రస్తుతం కెనడాలో ఉన్నట్లు సమాచారం. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ వాంటెడ్ నిందితుడిగా ఉన్నాడు.
కాల్పుల తర్వాత ఘటనాస్థలంలో ఐదు ఖాళీ షెల్స్, ఒక లైవ్ బులెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఓ ఖాళీ షెల్‌ను సల్మాన్ ఇంటి బాల్కనీలో గుర్తించారు. కాల్పుల సమయంలో సల్మాన్ ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు కాల్పుల తర్వాత నిందితులు బాంద్రా వదిలి పారిపోయినట్లు సమాచారం. నిందితులు ఉపయోగించిన బైక్‌ను సల్మాన్ ఇంటికి కిలోమీటరు దూరంలో స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి వారు ఆటో రిక్షాలో పరారైనట్లు గుర్తించారు. దుండగులను గాలించేందుకు 15 బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు నిందితులు ఉపయోగించిన బైక్‌ను దొంగలించడం లేదా సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల్లో ఒక అనుమానితుడిని గురుగ్రామ్‌కు చెందిన విశాల్ రాహుల్‌గా గుర్తించారు. ఇతడు లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదరా దగ్గర షూటర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తుండగా.. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు కూడా ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
కాగా సల్మాన్ ఖాన్‌పై బిష్ణోయ్ గ్యాంగ్ గతంలోనూ పలుమార్లు బెదిరింపులకు పాల్పడింది. గతేడాది మార్చిలో అతడిని బెదిరిస్తూ పంపిన ఓ ఈమెయిల్ తీవ్ర కలకలం రేపింది. దీని తర్వాత సల్మాన్ భద్రతను వై ప్లస్ కేటగిరీకి పెంచారు. ఇప్పుడు ఏకంగా ఆయన ఇంటి ముందే కాల్పులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments