ఐటీగ్రిడ్స్‌ స్కాం: కీలక ఆధారాలు దొరికాయ్.. అమెజాన్‌‌కు నోటీసులు

  • IndiaGlitz, [Monday,March 04 2019]

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీగ్రిడ్స్ స్కాంలో కీలక ఆధారాలు దొరికాయని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. గత మూడ్రోజులుగా నెలకొన్న ఈ వ్యవహారంపై సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటి వరకూ అసలేం జరిగింది..? సోదాల్లో ఏం దొరికాయ్..? సేవా మిత్ర పేరుతో గ్రిడ్స్ కంపెనీలో అసలేం జరుగుతోంది..? అనే ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు.

సజ్జనార్ మాటల్లోనే...

లోకేశ్వర్‌ రెడ్డి ఫిర్యాదుతోనే ఐటీ గ్రిడ్స్‌లో సోదాలు నిర్వహించాము. ఉద్యోగులు సమక్షంలోనే సోదాలు జరిపాము. ఆ సంస్థకు చెందిన ఉద్యోగులు విక్రమ్‌ గౌడ్‌, చంద్ర శేఖర్‌, ఫణి కుమార్‌, భాస్కర్‌ల సమక్షంలోనే ఆధారాలు సేకరించాం. కీలకమైన ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను సీజ్‌ చేసి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాము. విచారణలో కూడా కీలకమైన ఆధారాలు సేకరించాం.

సేవామిత్ర పేరుతో డేటా సేకరిస్తున్నారు. సున్నితమైన డేటా సేకరిస్తున్నారు. విచారణ ప్రారంభమై రెండ్రోజులైంది. ఈ కేసులో ఎంత పెద్దోళ్లు ఉన్నా ఎవర్నీ వదిలిపెట్టేది లేదు. అన్నీ చట్టప్రకారమే జరుగుతాయ్. ఐటీ గ్రిడ్ సంస్థ దగ్గర ఏపీ ప్రజల ఆధార్, ఓటర్ కార్డ్, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వారి కులాల వివరాలు ఉన్నాయి. నియోజకవర్గాల వారిగా ఓటర్లు డేటా, ఐడీ కార్డ్, అడ్రస్‌లు, కులం వారు ఏ పార్టీకి చెందిన వారు అనే డేటా అందులో ఉంది. అంతేకాకుండా ఏ పార్టీకి ప్రిపరెన్స్ చేస్తున్నారనేది సమాచారం సేకరించారు. వాటిని ఎందుకు సేకరించారు? ఎలా సేకరించారన్న దానిపై దర్యాప్తు కొనసాగుతుంది అని సజ్జనార్ స్పష్టం చేశారు.

నోటీసులిచ్చాం అశోక్ వస్తే సరే..!

ఈ వ్యవహారంలో మొట్టమొదటి వ్యక్తి అయిన అశోక్‌కు ఇదివరకే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇంత వరకు పోలీసుల ఎదుట హాజరుకాలేదు. ఆయన దగ్గరే కీలక ఆధారాలున్నాయ్.. వీలైనంత త్వరగా వచ్చి లొంగిపోవాలని మీడియా ద్వారా కోరుతున్నాను. ఆయనంతకు ఆయనే వస్తే సరే లేకుంటే అరెస్ట్ తప్పదు అని సీపీ తెలిపారు.

ఏపీ పోలీసులపై సజ్జనార్ కన్నెర్ర..!

భాస్కర్‌‌‌తో పాటు ముగ్గు్రు మా ఆధీనంలో ఉంటే పెదకాకాణిలో కేసుపెట్టడం జరిగింది. ఆ రోజు ఉదయం వారంతా మా దగ్గరుంటే .. సాయంత్రానికల్లా కేసు కట్టడం జరిగింది. ఒక ఏసీపీ, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి వచ్చి మాదాపూర్ పీఎస్‌‌కు వచ్చి మనకు కావాల్సినోడు.. మిస్సింగ్ కేసు అని చెప్పి రావడం జరిగింది. మా దగ్గరున్నారు.. ఆయన ఒక విట్‌నెస్ అని చెప్పినప్పటికీ హైకోర్టుకు హెబియస్ కార్పస్ పెట్టి.. అందులో కూడా రకరకాలుగా చెప్పారు. అంతేకాకుండా వాళ్ల ఫ్యామిలీ దగ్గరికెళ్లి వారిని ఇబ్బందిపెట్టి స్టేట్మెంట్ తీసుకొని హడావుడి చేశారు.. అంత అవసరమా..? మా దగ్గరున్నారు మేం చెబుతుంటే అటెన్షన్ డైవర్ట్ చేయడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఈ కేసులో ఎవరున్నా సరే వదిలే ప్రసక్తే లేదు. ఎంతపెద్దవాళ్లయినా సరే వివరణ ఇచ్చి తీరాల్సిందే. ఆ తర్వాత ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డిని ఏపీ పోలీసులు ఇబ్బంది పెట్టారు. ఇలా ఇబ్బంది పెట్టిన పోలీసులపై కూడా కేసు పెట్టడం జరిగింది అని సజ్జనార్ తేల్చిచెప్పారు.

అమెజాన్‌‌కు నోటీసులు..

ఐటీ గ్రిడ్ సంస్థ టీడీపీకి చెందిన సేవా మిత్ర యాప్ నిర్వహిస్తోంది. ఆ యాప్‌లో ఓటర్ల పేర్లు, చిరునామా వివరాలు ఉన్నాయి. అందులో డేటా హైదరాబాద్ నుంచే చోరీ అయిందనందున తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేస్తారు. ఈ కేసులో అమెజాన్ సంస్థకు నోటీసులు జారీ చేశాం. అమెజాన్ వెబ్ సర్వర్ల నుంచి మరిన్ని వివరాలు తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. ఐటీ గ్రిడ్స్ సీఈవో దాకవరపు అశోక్ కోసం ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో గాలింపు సాగుతోంది.

ఆయన పొరుగు రాష్ట్రంలో ఉన్నా కచ్చితంగా పట్టుకుని తీరుతాం. కేసులో మరింత సమాచారం కోసం ఆధార్ సంస్థ, ఈసీకి లేఖ రాశాం. ఈ డేటాతో ఎవరినినైనా బ్లాక్ మెయిల్ చేయవచ్చు. ఐటీ గ్రిడ్ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను రెండు రోజుల పాటు విచారించాం. విచారణ కొనసాగుతుంది. లబ్ధిదారుల డేటాను ఎలా సేకరించారు? వారి దగ్గర ఎందుకు ఉంచుకున్నారు? దర్యాప్తులో తేలుతుంది అని సజ్జనార్ తెలిపారు. సో మొత్తానికి చూస్తే మున్ముంథు ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు.

More News

రాజ‌కీయ వ్యవ‌స్థకి చికిత్స చేస్తా: పవన్

"నేను ఓ సోష‌ల్ డాక్టర్‌ని రాజ‌కీయ వ్యవ‌స్థకి చికిత్స చేస్తాను. అంద‌రికీ ఉచిత విద్య, వైద్యం జ‌న‌సేన ల‌క్ష్యం.  కుల‌మ‌తాల‌కి అతీతంగా అమ‌లుప‌రుస్తాం" అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

5కోట్ల మంది మహిళలు చంద్రబాబుగారి బొమ్మలే!

దివ్యవాణి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. బహుశా సినిమాల్లో ఉన్నప్పుడు ఈమె పెద్దగా ఎవరికీ తెలియకపోయినప్పటికీ..

పూర్ణ‌, శ్రావ‌ణిల ప్ర‌యాణ‌మే 'మ‌జిలీ'

నిజ జీవితంలో పెళ్లి చేసుకున్న హీరో నాగ‌చైత‌న్య‌, హీరోయిన్ సమంత పెళ్లి త‌ర్వాత జంట‌గా న‌టిస్తోన్న చిత్రం 'మ‌జిలీ'. శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి

రాయలసీమ పూర్వ వైభవం తెచ్చే బాధ్యత నాదే..

"రాయ‌ల‌సీమ చ‌దువుల నేల‌. అన్నమయ్య, వెంగ‌మాంబ‌, వీరబ్రహ్మేంద్రస్వామి, పీర్ బాబా వంటివారు తిర‌గాడిన నేల‌. ఇలాంటి నేల‌కు ముఠా, వ‌ర్గ పోరుతో కొన్నికుటుంబాలు

చంద్రబాబు దమ్ముంటే ఎదుర్కో..: కేటీఆర్ సవాల్

గత మూడ్రోజులుగా జరుగుతున్న డేటా వార్ తెలంగాణ వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయింది. ఈ వ్యవహారాన్ని అటు టీడీపీ.. ఇటు వైసీపీ రెండు ప్రధాన పార్టీలూ సీరియస్‌గా తీసుకున్నాయి.