ఏపీ పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లోని పాలనా యంత్రాంగంలో కీలక మార్పులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టూరు. ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో సీట్లు దక్కించుకుని సీఎంగా ప్రమాణం చేసిన నాటి నుంచి తనదైన శైలిలో పరిపాలన చేస్తూ.. విమర్శకుల ప్రశంసలను అందుకుంటూ ముందుకెళ్తున్న జగన్ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా.. కరోనా కష్టాలున్నా సంక్షేమ పథకాలను మాత్రం ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి నిర్ణయాలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. అంతేకాదు.. రాష్ట్రం అమలు చేస్తున్న కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్న సందర్భాలున్నాయంటే అర్థం చేసుకోవచ్చు.
నాన్ కేడర్ జేసీగా విధులు..
ఇదిలా ఉంటే.. బుధవారం నాడు జిల్లా స్థాయిలోని పాలనా యంత్రాంగంలో జగన్ సర్కార్ కీలక మార్పులు చేసింది. జిల్లాలకు అదనంగా మరో జేసీని (జాయింట్ కలెక్టర్) ప్రభుత్వం నియమించింది. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ప్రతి జిల్లాకు ఇలా మరో ఐఏఎస్ అధికారిని తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జిల్లా స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని పటిష్టం చేసేలా జగన్ సర్కార్ కార్యాచరణ చేస్తోంది. 13 అదనపు జేసీల పోస్టులను ఏర్పాటు చేస్తూ ఈ మేరకు బుధవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అంటే ఇకపై జిల్లాల్లో కేడర్ పోస్టుల్లో ఉన్న ఇద్దరు జేసీలు ఉంటారన్న మాట. ఈ ఇద్దరు జేసీలు నాన్ కేడర్ జేసీగా విధులు నిర్వహించనున్నారు. జేసీల మధ్య పని విభజన కూడా చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
వారు చేయాల్సిన పనులు ఇవీ..
రెవెన్యూ, అభివృద్ధి, సంక్షేమ బాధ్యతల పర్యవేక్షణకు ముగ్గురు జేసీలను ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ చూసే జేసీకి రైతు భరోసా సహా, వ్యవసాయం ఇరిగేషన్, లా అండ్ ఆర్డర్, ఇంధన శాఖల బాధ్యతలు అప్పగించడం జరిగింది. అభివృద్ధి బాధ్యతలు చూసే జేసీకి గ్రామ సచివాలయాల బాధ్యతలతో పాటు పీఆర్, విద్యా, ఆరోగ్యం, మున్సిపల్, హౌసింగ్ శాఖలు బాధ్యతలను అప్పగించింది. సంక్షేమ బాధ్యతలు చూసే జేసీకి పరిశ్రమలు, దేవాదాయ శాఖ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్వర్వుల్లో జగన్ సర్కార్ నిశితంగా వివరించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments