'కేటుగాడు' మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
ఉలవచారు బిర్యానితో సినిమాల్లోకి తెరంగేట్రం చేసిన తేజస్ చేసిన మరో ప్రయత్నమే కేటుగాడు. తన సెకండ్ ట్రైలో మాత్రం క్లాస్ గా కాకుండా మాస్ ఇమేజ్ కోసం ట్రై చేశాడు. అందులో భాగంగా టైటిల్, కథ సహా కమర్షియల్ ఎంటర్ టైనర్‌కి కావాల్సిన జాగ్రత్తలు తీసుకున్నాడు. మరి కేటుగాడుతో తేజస్ ఎలా ఆకట్టుకున్నాడో తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళ్ళాల్సిందే....
కథ-
సినిమా ఫైట్ సీన్‌తో స్టార్టవుతుంది. కొందరు చందు(తేజస్)ని కొట్టి అకీరా(చాందిని చౌదరి)ని తీసుకెళ్ళిపోతారు. అక్కడ నుండే కథ స్టార్టవుతుంది. చందు, తన స్నేహితుడు(ప్రవీణ్)తో కలిసి కార్ల దొంగతనం చేస్తుంటాడు. ఓ సందర్భంలో బార్‌లో అకీరాను చూసి ప్రేమిస్తాడు. ఆమె వెంటపడతాడు. ఆమె తన ఫామ్‌హౌస్‌కి వెళుతుందని తెలిసి ఫాలో అవుతాడు. అక్కడ డాబా దగ్గర ఓ కారుని దొంగతనం చేస్తాడు. ఆ కారు డిక్కిలో అకీరా ఉంటుంది. ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారని తెలుసుకుంటాడు. కానీ పోలీసులు తనపై అనుమాన పడుతున్నారని తెలుసుకున్న చందు, అకీరా అన్నప్రకాష్(రాజీవ్ కనకాల)కి ఫోన్ చేస్తాడు. అయితే తనే తన చెల్లిని కిడ్నాప్ చేయించానని చెప్పడంతో చందు, అకీరాలు ఆశ్చర్యానికి లోనవుతారు. అంతలోనే అజయ్(అజయ్) అనే వ్యక్తి అకీరాను చంపడానికి వస్తాడు. అజయ్ దగ్గర నుండి తప్పించుకున్న చందు, అకీరాలకు తెలిసే నిజం ఏమిటి? అకీరాను చంపాలనుకున్నదెవరు? అజయ్ ఎవరు? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష-
తేజస్ తన మొదటి చిత్రంతో పోల్చితే ఈ చిత్రంలో మరింత మంచి నటనను కనపరిచాడు. మాస్ ఇమేజ్ కోసం కొత్తగానే ప్రయత్నించాడు. ఫైట్స్‌లోకూడా ఎక్కడా ఓవర్ చేయకుండా నార్మల్‌గానే చేశాడు. డ్యాన్సులు, ఫైట్స్ బాగా చేశాడు. చాందిని తొలి సినిమా అయినా బాగానే నటించింది. అక్కడక్కడా ఎక్స్‌ప్రెషన్స్ సరిగా చేయలేదు. తొలి సినిమా కాబట్టి తన నుండి ఎక్కువ పెర్‌ఫార్మెన్స్ ఆశించడం తప్పే అవుతుంది. ప్రవీణ్,సప్తగిరిలు తమ పాత్రల పరిధి మేర కామెడిని పండించే ప్రయత్నంచేశారు. రాజీవ్ కనకాల చాలా రోజుల తర్వాత మంచి రోల్ చేశాడు. అజయ్ కూడా విలన్‌గా మంచి మార్కులే సంపాదించుకున్నాడు. పృథ్వీ, అదుర్స్ రఘ, స్నిగ్ధ తదితరులు వారి పాత్రల మేర న్యాయం చేశారు. డైరెక్టర్ కిట్టు నల్లూరి తీసుకున్న పాయింట్ కొత్తగానే ఉన్న దాని చుట్టూ అల్లుకున్న సబ్‌ప్లాట్స్ మాత్రం వీక్‌గా ఉన్నాయి. కామెడి పంచ్‌లు అనుకున్న రేంజ్‌లో పేలలేదు. సాంగ్స్ కూడా పరావాలేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. మల్హర్‌భట్ సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ బాగాలేదు. ఫస్టాఫ్ లో చాలా వరకు సీన్స్ ను ఎడిట్ చేసుంటే బావుండేది. అప్పారావు కామెడి సీన్ స్టార్టవుతుందే కానీ దాని కంటిన్యూటీ సీన్‌లో అప్పారావు కనపడడు. ఫేస్ బుక్‌లో హీరోయిన్‌కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపే హీరో ఫేస్‌ను హీరోయిన్ గుర్తుపట్టకపోవడం, నాకు దారి తెలియదు నేను గూగల్ మ్యాప్ ను ఫాలో అవుతానని చెప్పడం వంటి సీన్స్ లో దర్శకుడు లాజిక్స్ మిస్ అయ్యాడు.
విశ్లేషణ-
చెప్పాలనుకున్న పాయింట్ బలంగా ఉంది. కానీ దాని చుట్టూ అల్లుకున్న ప్లాట్స్, చేసిన ట్రీట్ మెంట్ అనుకున్న రేంజ్‌లో లేదు. కామెడి పార్ట్ పరావాలేదు. సాయికార్తీక్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సపోర్ట్ ఇచ్చింది. మొత్తం కేటుగాడు డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్ టైనర్‌లా కాకుండా నార్మల్ ఎంటర్ టైనర్‌గా ఆడియెన్స్‌కి నచ్చుతుంది.
బాటమ్ లైన్ - రిపీట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ కేటుగాడు
రేటింగ్ 3/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments