అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా 'కేటుగాడు'

  • IndiaGlitz, [Wednesday,September 16 2015]

తేజస్‌, చాందిని హీరో హీరోయిన్లుగా వి.ఎస్‌.పి. తెన్నేటి సమర్పణలో వెంకటేష్‌ మూవీస్‌, 100 క్రోర్స్‌ అకాడమీ పతాకాలపై కిట్టు నల్లూరి దర్శకత్వంలో వెంకటేష్‌ బాలసాని నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ కేటుగాడు'. ఈ సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ను మంగళవారం హైదరాబాద్ లోని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కె.ఎస్.రామారావు ప్లాటినం డిస్క్ లను చిత్ర యూనిట్ కు అందజేశారు. సినిమాని సెప్టెంబర్ 18న విడుదల చేస్తున్నాం. సినిమా బాగా వచ్చింది. సినిమాని దర్శకుడు దర్శకుడు కిట్టు నల్లూరి, నిర్మాత వెంకటేష్ బాలసాని చాలా క్వాలిటీతో నిర్మించారు. సినిమా అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందింది. సినిమాని ఆశీర్వదించాలని చిత్రయూనిట్ కోరారు.