'కేటుగాడు' ఆడియో విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
తేజస్ లో ఎదగాలని తపనతో పాటు కసి కూడా ఉంది. ఎనర్జీతో పాటు ఎదుటివారు చెప్పేది వినే తత్వమున్న వ్యక్తి అంటూ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ హీరో తేజస్ గురించి అన్నారు. ఉలవచారు బిర్యాని` చిత్రంలో అలరించిన యంగ్ హీరో తేజస్ కంచర్ల హీరోగా ప్రముఖ రచయిత వి.ఎస్.పి తెన్నేటి సమర్పణలో వెంకటేష్ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం కేటుగాడు`.
పలు షార్ట్ ఫిలింస్ నటించిన బ్యూటీ డాల్ చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. కిట్టు నల్లూరి దర్శకుడు. వెంకటేష్ బాలసాని నిర్మాత. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జూలై 26న హైదరాబాద్‌లో జరిగింది. థియేట్రికల్ ట్రైలర్‌ను విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ విడుదల చేశారు. బిగ్ సీడీని ప్రముఖ నిర్మాత కె.యస్.రామారావు ఆవిష్కరించారు. ఆడియో సీడీలను కె.యస్.రామారావు ఆవిష్కరించి ప్రకాష్ రాజ్‌కి తొలి సీడీని అందించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ తేజస్ గురించి పై మాటలన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ తేజస్ డైరెక్షన్ టీమ్‌లో వర్క్ చేసినందువల్ల తనకి నటన గురించి మంచి అవగాహన వుంది. ఉలవచారు బిర్యాని ఆడిషన్ చేస్తున్నప్పుడు కె.యస్.రామారావు సలహా మేర తనని ఆడిషన్ చేశాను. తనలో ఎదగాలనే తపన కనపడింది. తప్పకుండా తను మంచి యాక్టర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈ సినిమా విషయానికి వస్తే సాయికార్తీక్ సంగీతం బావుంది. ఒక హెల్దీ టీమ్ వర్క్ కనపడుతుంది. సినిమా తప్పకుండా పెద్ద హిట్టవుతుంది. టీమ్ కి ఆల్ ది బెస్ట్ అన్నారు. ఈ సినిమాని దర్శకుడు కిట్టు, నిర్మాత వెంకటేష్ బలసాని ఎంత కాన్ఫిడెంట్ గా స్టార్ట్ చేశారో ఇప్పుడు కూడా అదే కాన్ఫిడెన్స్ కనపడుతుంది. సినిమాని రిలీజ్ కి రెడీ చేసేశారు. త్వరలోనే విడుదల తేదీని అనౌన్స్ చేస్తారు. దర్శకుడు కిట్టు ప్రతి షాట్‌ను చాలా కేర్ తీసుకుని చేశాడు. పెద్ద సంగీత సంగీత దర్శకుకు ఏ మాత్రం తగ్గిపోకుండా సాయికార్తీక్ సంగీతం కంపోజ్ చేశాడు. ప్రతి పాట చాలా డిపరెంట్‌గా ఉంది. జోషి సినిమాటోగ్రఫీతో సినిమా చాలా రిచ్‌గా కనపడుతుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని కె.యస్.రామారావు అన్నారు.
నా ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత నేను హీరోగా ఇక్కడ నిలబడి ఇద్దరు వ్యక్తులు కారణం వారే కె.యస్.రామారావుగారు, ప్రకాష్‌రాజుగారు. వారికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. సాయికార్తీక్ నాకు మంచి ఫ్రెండ్. ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. వెంకటేష్‌గారి వంటి నిర్మాత ఇండస్ట్రీకి అవసరం. కిట్టు ఒక మంచి సినిమాని నాకు అందించాడు. చాందిని చక్కగా నటించింది. సపోర్ట్ చేసిన ఆర్టిస్ట్స్, టెక్నిషియన్స్ కి థాంక్స్ అని హీరో తేజస్ అన్నారు. సాయికార్తీక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రతి పాటను డిఫరెంట్‌గా ఇచ్చారు. జోషిగారి సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అవుతుంది.
ఒక మంచి సినిమాని రూపొందించాం. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని నిర్మాత వెంకటేష్ బలసాని అన్నారు. సాయికార్తీక్‌ను నేను అన్నయ్య అని పిస్తుంటాను. నాపై అభిమానంతో మంచి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా మేకింగ్ విషయంలో నిర్మాత వెంకటేష్‌గారు నేను ఏదీ కోరినా దాన్ని సమకూర్చారు. ఒక మంచి క్వాలిటీ సినిమాని రూపొందించడంతో పూర్తి సహకారాన్ని అందించారు. తేజస్ ఎక్స్‌ట్రార్డినరీగా నటించాడు. అలాగే నటీనటుల, టెక్నిషియన్స్ సహకారం అందించడంతో అనుకున్న సమయంలో సినిమాని పూర్తి చేశాం. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్ అని దర్శకుడు కిట్టు బలసాని అన్నారు.
దర్శకుడు కిట్టు, హీరో తేజస్ తో మంచి అనుబంధం ఉంది. నా స్వంత సినిమాలా భావించి పనిచేశాను. నిర్మాత వెంకటేష్ గారు సినిమాని ప్రొడక్షన్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఆయన ఇచ్చిన ఎంకరేజ్ మెంట్ తోనే సినిమాని అనుకున్న సమయంలో మంచి క్వాలిటీతో పూర్తి చేయగలిగామని సంగీత దర్శకుడు సాయి కార్తీక్ అన్నారు.
మంచి కథ, యూత్ సహా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది. దర్శకుడు కిట్టు, నిర్మాత వెంకటేష్ బలసాని, హీరో తేజస్ సహా అందరికీ ఆల్ ది బెస్ట్ అని చిత్ర సమర్పకులు వి.ఎస్.పి.తెన్నేటి అన్నారు. హీరోయిన్ కావడానికి ఐదేళ్ల సమయం పట్టింది. అయితే మంచి పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీ చేశాను. తేజస్ మంచి కోస్టార్ అని హీరోయిన్ చాందిని అన్నారు. తేజస్ ఎనర్జీకి తగిన టైటిల్ తో మన ముందుకు వస్తున్నాడు. సినిమా తప్పకుండా మంచి సక్సెస్ సాధిస్తుందని హీరో సుశాంత్ అన్నారు.
అలాగే ఈ కార్యక్రమంలో జె.వి.మోహన్‌గౌడ్, సుశాంత్, ఆర్.పి.పట్నాయక్, ప్రతాని రామకృష్ణగౌడ్, బాలభాను, సప్తగిరి, అజయ్, మల్కాపురం శివకుమార్, మారుతి, గొట్టిముక్కల పద్మారావు తదితరులు పాల్గొని ఆడియో, సినిమా పెద్ద హిట్ కావాలని యూనిట్ ను అభినందించారు.
అజయ్, సుమన్, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, సప్తగిరి, సోఫియా, రఘు కారుమంచి, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్: సాయికార్తీక్, సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్ జోషి, సాహిత్యం: భాషా శ్రీ, బాలాజీ, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సుబ్బరాయ శర్మ, యాక్షన్: నందు, డ్యాన్స్: సాయిరాజ్, ఎడిటర్: పశుమ్ వి.రావ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అచ్చిబాబు.యం., సంపత్‌కుమార్, నిర్మాత: వెంకటేష్ బసాని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిట్టు నల్లూరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com