'కేటుగాడు' ఆడియో రిలీజ్ డేట్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఉలవచారు బిర్యాని` ద్వారా హీరోగా పరిచయమైన తేజస్ నటిస్తున్న తాజా చిత్రం 'కేటుగాడు'. నూతన దర్శకుడు కిట్టు నల్లూరి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో చాందినీ హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ రచయిత వీఎస్పీ తెన్నేటి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని '100 క్రోర్స్ అకాడమీ'తో కలిసి వెంకటేష్ మూవీస్ పతాకంపై యువ వ్యాపారవేత్త వెంకటేష్ బలసాని నిర్మించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలను జూలై 25న హైదరాబాద్ లోని తాజ్ దక్కన్ లో నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా..
నిర్మాత వెంకటేష్ బలసాని మాట్లాడుతూ `వైవిధ్యమైన కథాంశంతో అన్ని వర్గాల ప్రేక్షకుల ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా, క్వాలిటీ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని రూపొందించాం. సాయికార్తీక్ మంచి మ్యూజిక్ అందించారు. ఆడియో కార్యక్రమాన్ని జూలై 25న నిర్వహిస్తున్నాం. తేజస్ ఈ చిత్రంలో చాలా డిఫరెంట్ లుక్ తో కనపడతాడు. ఆగస్ట్ లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments