బ్రేకింగ్: కార్పొరేటర్ పదవికి కేశినేని నాని కుమార్తె శ్వేత రాజీనామా

  • IndiaGlitz, [Monday,January 08 2024]

విజయవాడ రాజకీయాలు రోజురోజుకు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఇప్పటికే బెజవాడ ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కేశినేని నాని(Kesinenei Nani) ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కుమార్తె కేశినేని శ్వేత(Kesineni Swetha) కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు నగర కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లిన ఆమె.. మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు స్పష్టంచేశారు.

రాజీనామాకు ముందు ఇవాళ ఉదయం విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఇంటికి వెళ్లి ఆయనతో శ్వేత సమావేశమయ్యారు. తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన గద్దె రామ్మెహన్‌కు ముందుగా తన నిర్ణయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయనను కలిశానని తెలిపారు. కాగా కూతురు రాజీనామా విషయాన్ని ఎంపీ కేశినేని నాని ముందుగానే వెల్లడించారు. కార్పొరేటర్ పదవితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా శ్వేత రాజీనామా చేస్తుందని సొషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని తమ్ముడు కేశినేని చిన్నిని ప్రకటించేందుకు టీడీపీ చీఫ్‌ చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని పార్టీ నేతల ద్వారా నానికి తెలియజేశారు. ఈ విషయాన్ని నాని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో ఒక్కసారి బెజవాడ రాజకీయాలు హీటెక్కాయి. అనంతరం త్వరలోనే లోక్‌సభ స్పీకర్‌ను కలిసి ఎంపీ రాజీనామా చేస్తానని.. ఆమోదించగానే టీడీపీకి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే మేడితోక తో కలిసి ఒకే కారులో ప్రయాణిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కుమార్తె శ్వేత కూడా పార్టీతో పాటు కార్పొరేటర్ పదవికి కూడా రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఇక కృష్ణా జిల్లా రాజకీయాల్లో మున్మందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

More News

Guntur Karaam: యూట్యూబ్ ను షేక్ చేస్తోన్న 'గుంటూరు కారం' ట్రైలర్.. ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన 'గుంటూరు కారం'(Guntur Kaaram)చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో

Education in AP: సీఎం వైయస్ జగన్ సంస్కరణల ఫలితం.. దేశంలోనే ఏపీ ఫస్ట్..

ఏ రాష్ట్రంలోనైనా పేదరికం పోవాలంటే నాణ్యమైన విద్య ద్వారానే సాధ్యమవుతోంది. విద్యారంగం బాగుంటే ఆ రాష్ట్ర భవిష్యత్ కూడా కళకళలాడుతుంది.

Jr NTR Fans: జూ.ఎన్టీఆర్ అభిమానులపై లోకేష్ సైన్యం దాడి.. సర్వత్రా ఆగ్రహావేశాలు..

టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరులో నిర్వహించిన రా.. కదలిరా సభా ప్రాంగణంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు తీవ్ర అవమానం జరిగింది. తారక్ ఫొటోతో ఉన్న జెండాలను ఆయన అభిమానులు ప్రదర్శించారు.

PM Modi:అంతరిక్షంలో ఆదిత్య ఎల్-1' ప్రయోగం సక్సెస్.. ప్ర‌ధాని మోదీ హర్షం..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO)మరో ఘనత తన ఖాతాలో వేసుకుంది. సూర్యుడి రహస్యానాలను అధ్యయనం చేసేందుకు నింగిలోకి పంపి ఆదిత్య ఎల్‌-1(Aidtya L1)

Anganwadi workers:అంగన్‌వాడీ వర్కర్లపై 'ఎస్మా' అస్త్రం సంధించిన ప్రభుత్వం

తమ డిమాండ్లు నెరవేర్చాలని నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.