బ్రేకింగ్: కార్పొరేటర్ పదవికి కేశినేని నాని కుమార్తె శ్వేత రాజీనామా
Send us your feedback to audioarticles@vaarta.com
విజయవాడ రాజకీయాలు రోజురోజుకు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఇప్పటికే బెజవాడ ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కేశినేని నాని(Kesinenei Nani) ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కుమార్తె కేశినేని శ్వేత(Kesineni Swetha) కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు నగర కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లిన ఆమె.. మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు స్పష్టంచేశారు.
రాజీనామాకు ముందు ఇవాళ ఉదయం విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఇంటికి వెళ్లి ఆయనతో శ్వేత సమావేశమయ్యారు. తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన గద్దె రామ్మెహన్‌కు ముందుగా తన నిర్ణయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయనను కలిశానని తెలిపారు. కాగా కూతురు రాజీనామా విషయాన్ని ఎంపీ కేశినేని నాని ముందుగానే వెల్లడించారు. కార్పొరేటర్ పదవితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా శ్వేత రాజీనామా చేస్తుందని సొషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని తమ్ముడు కేశినేని చిన్నిని ప్రకటించేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని పార్టీ నేతల ద్వారా నానికి తెలియజేశారు. ఈ విషయాన్ని నాని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో ఒక్కసారి బెజవాడ రాజకీయాలు హీటెక్కాయి. అనంతరం త్వరలోనే లోక్‌సభ స్పీకర్‌ను కలిసి ఎంపీ రాజీనామా చేస్తానని.. ఆమోదించగానే టీడీపీకి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే మేడితోక తో కలిసి ఒకే కారులో ప్రయాణిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కుమార్తె శ్వేత కూడా పార్టీతో పాటు కార్పొరేటర్ పదవికి కూడా రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఇక కృష్ణా జిల్లా రాజకీయాల్లో మున్మందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout